INTINTI GRUHALAKSHMI: జాహ్నవి మీద కోపంతో రెచ్చిపోయిన విక్రమ్.. బెదిరింపులకు భయపడిపోతున్న నందు!

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ భార్యతో కలవాలని ప్రయత్నిస్తున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

 

 ఎపిసోడ్ ప్రారంభంలో నేను కామ్ గానే ఉందాము అనుకున్నాను కానీ నువ్వు  బెదిరించావు కదా అందుకే నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను. అయినా ఎవరైనా వద్దు అంటే ఆ పని చేయటం నాకు బాగా అలవాటు అంటుంది జాహ్నవి. అంతలో అక్కడికి  తులసి ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ వస్తుంది. నన్ను మీ అమ్మాయి ఫ్రీగా ఉండొద్దు అంటుంది అంటూ కంప్లైంట్ ఇస్తుంది జాహ్నవి.

 

 నువ్వు తన మాటలు ఏమీ పట్టించుకోవద్దు ఆడపిల్ల నవ్వుతూ, తుళ్లుతూ ఉంటేనే బాగుంటుంది అంటుంది తులసి. థాంక్స్ పెద్దమ్మ కూతురు కదా అని తన పక్షాన మాట్లాడతావేమో అనుకున్నాను అంటుంది జాహ్నవి. అలాంటిదేమీ లేదు అంటూ పూజకి ఇద్దరినీ త్వరగా రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. ఆ తర్వాత చూసావు కదా నీ అత్తఇంట్లోనే కాదు నీ పుట్టింట్లో కూడా నా మాటే చెల్లుతుంది అంటుంది జాహ్నవి.

 ఆ తర్వాత పూజ చేసి హారతి ఇస్తుంది తులసి. తర్వాత అందరికీ ప్రసాదం పెడుతుంది. విక్రమ్ చేతిలో ఉన్న ప్రసాదం గబుక్కున జాహ్నవి నోట్లో వేసుకుంటుంది. నీకు పెడుతుంది కదా ఇంటికా కంగారు అని కోప్పడుతుంది దివ్య. జాహ్నవి చేతిలో ప్రసాదం పెట్టి ఇందాక అల్లుడుగారు ప్రసాదం నువ్వు తినేసావు కాబట్టి ఇప్పుడు ఈ ప్రసాదం అల్లుడుగారు తింటారు అనేటప్పటికీ జాహ్నవి చేతిలో ప్రసాదం గబుక్కున విక్రమ్ తినేస్తాడు.

 

అది చూసిన రాజ్యలక్ష్మి విక్రమ్ కి జాహ్నవి తో పెళ్లి ఇష్టమే అని తమ్ముడికి చెప్తుంది. నిజమే అక్కయ్య మనం ఎంత చెప్పాక కూడా విక్రమ్ అర్థం చేసుకోకపోవటానికి తనేమీ పాలు తాగే పిల్లాడు కాదు మీసం ఉన్న మగాడు అంటాడు బసవయ్య. తొందర్లోనే మా దివ్య పీడ విరగడైపోతుంది అని బసవయ్య దంపతులు, రాజ్యలక్ష్మి ఆనందపడతారు. ఆ తర్వాత అందరూ ఉట్టి కొట్టడానికి బయలుదేరుతారు.

 

ఉట్టి కొట్టేటప్పుడు రెండు గ్రూపులుగా విడిపోతారు  దివ్య, జాహ్నవి.  జాహ్నవి పక్కన బసవయ్య, రాజ్యలక్ష్మి ఉంటే దివ్య పక్కన నందగోపాల్ వస్తాడు. విక్రమ్ ని తనవైపు రమ్మంటుంది జాహ్నవి. కానీ విక్రమ్ దివ్య వైపు వెళ్తాడు. అయితే ఆటలో జాహ్నవి గెలిచేలాగా ఉట్టి కిందకు దించి ఉంచుతాడు విక్రమ్ దాంతో ఉట్టిని సులభంగా కొట్టేస్తుంది జాహ్నవి. మరదల్ని గెలిపించుకోవడానికి ఈ పార్టీలో చేరావా అని మనసులో అనుకుంటుంది దివ్య.

 

ఆ తర్వాత దివ్య వుట్టి కొట్టే సమయం వస్తుంది. జాహ్నవి ఉట్టి కొట్టింది, నువ్వు కూడా ఉట్టి కొడితే మ్యాచ్ డ్రా అవుతుంది లేదంటే  నువ్వు ఓడిపోతావ్  అంటాడు పరంధామయ్య. ఏంతకీ ఉట్టి కొట్టలేక పోతుంది దివ్య. టైం దగ్గర పడిపోవటంతో నందు ఆమెను ఎత్తుకొని ఉట్టి కొట్టిస్తాడు. నా పరువు కాపాడే నాన్న అంటూ ఆనంద పడిపోతుంది దివ్య. ఆ తర్వాత మేనకోడలు దగ్గరికి వచ్చిన రాజ్యలక్ష్మి నా పరువు కాపాడేవు మనం ఓడిపోతే ఆ దివ్య ముందు తలదించుకోవాల్సి వచ్చేది.

 

 తను మమ్మల్ని చాలా ఏడిపించింది. మొదటిసారి నీవల్ల తన కళ్ళల్లో భయం చూశాను అంటుంది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత అందరూ దాండియా ఆడుతూ ఉంటారు. విక్రమ్, దివ్య ఆడుతూ ఉంటే విక్రంతో దాండియా ఆడమని జాహ్నవికి చెప్తుంది రాజ్యలక్ష్మి. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు కదా అంటుంది జాహ్నవి. వాడు ఏదో తప్పక ఆడుతున్నాడు కావాలంటే వాడు మొహంలో ఎలాంటి ఆనందం లేదు చూడు అంటుంది రాజ్యలక్ష్మి.

 

మరోవైపు తులసితో దాండియా ఆడటానికి ఎవరు లేకపోవడంతో ఆమెతో ఆడటానికి నందు వస్తాడు. వాళ్ళిద్దర్నీ అలా చూస్తూ ఆనందంగా దాండియా ఆడుతూ ఉంటారు విక్రమ్, దివ్య. మధ్యలో జాహ్నవి  కలుస్తుంది. అయితే నందు వాళ్ళ వైపు చూస్తున్న విక్రమ్ చూసుకోకుండా కర్ర కొడితే అది దివ్యకి తగిలి గట్టి దెబ్బ తగులుతుంది. దివ్య బాధతో కింద పడిపోతుంది కంగారుపడుతుంది తులసి చిన్న దెబ్బ కదా ఎందుకంత కంగారు అంటుంది  జాహ్నవి.

 

 జాహ్నవి మీద కోప్పడతాడు విక్రమ్. అది చిన్న దెబ్బో,పెద్ద దెబ్బో నువ్వు చెప్పక్కర్లేదు అయినా మేమిద్దరం ఆడుతున్నాం కదా మధ్యలో నిన్ను ఎవడు రమ్మన్నాడు అంటూ మందలిస్తాడు విక్రమ్. తరువాయి భాగంలో హనీ ని వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెలతాడు నందు. అప్పుడు హనీ గార్డియన్స్ నందు తో తులసి ఏంటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటుంది , వద్దని చెప్పండి లేకపోతే పరిస్థితుల్లో ఎక్కడికైనా దారి తీయొచ్చు అంటూ నందుని  బెదిరిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తులసి హనీ భోజనం చేసిందో లేదో కనుక్కుందామని ఫోన్ చేయబోతుంటే ఆమె ఫోన్ లాక్కుంటాడు నందు ఒక్కసారిగా షాక్ అవుతుంది తులసి.

2023-09-19T03:40:28Z dg43tfdfdgfd