KAMAKSHI BHASKARLA: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్

Kamakshi Bhaskarla: బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ.. నాగ చైతన్యతో వెబ్ సిరీస్

కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla).. మా ఊరి పొలిమేర(Maa Oori Polimera) సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా ఘన సాధించడంతో ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలో జరిగిన 14న దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ ఫంక్షన్ లో పొలిమేర సినిమాకు గాను ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది ఈ బ్యూటీ. ఇక కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేసింది కామాక్షి. 

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ అమ్మడు మరో భారీ ఆఫర్ ను దక్కించుకుందట. అవును.. నాగ చైతన్య ప్రధాన పాత్రలో దర్శకుకాదు విక్రమ్ కె కుమార్ దూత వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ కు కొనసాగింపుగా దూత 2 తెరకెక్కుతోంది. దూతకు మించిన స్టోరీతో వస్తున్న ఈ సిరీస్ లో ఒక స్పెషల్ రోల్ కోసం కామాక్షి భాస్కర్లను తీసుకున్నారట మేకర్స్. దూత మొదటి పార్టులో కూడా కామాక్షి ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కానీ, ఈసారి చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించనుందట కామాక్షి. 

నిజానికి ఈ సమయంలో కామాక్షికి ఈ ఆఫర్ రావడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఈ సిరీస్ గనక హిట్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం కన్ఫర్మ్. అంతేకాదు ఆమె లైం లైట్ లోకి రావడం కూడా ఖాయమే. ఇటీవలే.. కెరీర్ మొదలుపెట్టిన కామాక్షి ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకోవడంతో ఆమె చాలా ఆనందంగా ఉంది. మరి దూత పార్ట్ 2లో కామాక్షి తన నటనతో ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T09:23:27Z dg43tfdfdgfd