పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప (Kannappa) చిత్రంలో ప్రభాస్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అయి తన షూటింగ్‌ను పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ప్రభాస్ ఈ సెట్స్‌లో అడుగుపెట్టలేదు.
వెయిటింగ్
నిజానికి ఏప్రిల్ మధ్యలో ఈ సినిమాకి డేట్స్ కేటాయించారు ప్రభాస్. కానీ ఆ తర్వాత కల్కి కోసం మే మొదటి వారానికి ఈ కాల్షీట్స్ రీషెడ్యూల్ చేశారట. కానీ ఇప్పటికీ ప్రభాస్ రాకపోయేసరికి కన్నప్ప టీమ్ అక్షయ్ కుమార్ ఎపిసోడ్లను ముందుకు జరిపినట్లు సమాచారం. ఇక కన్నప్ప కోసం ప్రభాస్ ఇంకా కొత్త తేదీలను కేటాయించలేదు. కానీ ఈ నెలలో ఎలాగైనా షూటింగ్ పూర్తి చేస్తానని మంచు విష్ణుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం మూడు రోజుల పాటు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ప్రభాస్ రాక కోసం కన్నప్ప టీమ్ ఎదురుచూస్తుంది.
ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ నందీశ్వరుడుగా కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అలానే నయనతార, ఆర్ శరత్‌కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి టాప్ స్టార్లు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నప్ప సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌కి మంచి రీచ్ వచ్చింది. సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండటంతో దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు మంచు విష్ణు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-05T14:22:55Z dg43tfdfdgfd