KUBERA: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్

Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్

తమిళ స్టార్ ధనుష్(Danush) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ధనుష్ బికారిగా కనిపించనున్నాడు అనే విషయం ఇప్పటికే తెలుసు. దానికి సంబందించిన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లుక్ చూసి చాలా మంది అవాక్కయ్యారు కూడా.

నిజానికి ధనుష్ లాంటి స్టార్ హీరో ఆ అలాంటి పాత్ర చేయడం అంటే మాములు విషయం కాదు. ఒక పాత్ర నచ్చింది అనే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఈ హీరో. ముందు నుండి ఆయన పంథా అదే. ఇప్పుడు ఈ సినిమా కోసం మరో సాహసమే చేశాడట. అదేంటంటే.. కుబేర షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని అతి పెద్ద డంపింగ్‌ యార్డ్‌లో జరుగుతోందట. షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే డంప్యార్డ్లో ఉన్నాడట ధనుష్. దాదాపు 10 గంటల ఆటు అక్కడి దుర్వాసనని భరిస్తూ అక్కడే ఉన్నాడట. సన్నివేశాలు సహజంగా రావడానికి కనీసం ముక్కుకి మాస్క్ కూడా ధరించలేదట. ఒక స్టార్ హీరో అయుండి ఒక పాత్ర కోసం ఈ స్థాయిలో నిబద్ధత చూపించడం అనేది మాములు విషయం కాదు. 

ఇది తెలుసుకున్న ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ధనుష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చేసే పనిపట్ల నీకున్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరేవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ  మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T09:31:07Z dg43tfdfdgfd