Malavika Jayaram : గుడిలో సింపుల్‌గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం
ప్రముఖ మలయాళ స్టార్ హీరో జయరామ్ మరియు పార్వతిల కుమార్తె మాళవిక వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. తన కాబోయే భర్త నవనీత్ గిరీష్‌ను శుక్రవారం (మే3న) గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ హిందూ వివాహంలో ఈ జంట వివాహం చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అనంతరం మలయాళ ఇండస్ట్రీకి చెందిన సురేష్ గోపి వంటి ప్రముఖ అతిథులు మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. వధువు మాళవిక జయరామ్ తన పెళ్లి రోజు కోసం తన తల్లిదండ్రుల నుండి ప్రేరణ పొందింది, ఆమె అయ్యంగార్ స్టైల్‌లో ఎర్రటి పట్టు చీరను ధరించింది.
మాళవిక తన గ్రాడ్యూయేట్ ను కంప్లీట్ చేసింది..వేల్స్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.ప్రస్తుతం మాళవిక ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అడుగు పెట్టింది..ఆమె భర్త నవనీత్ పాలక్కాడ్‌లోని నెన్మారాలోని కీజెప్పట్ కుటుంబానికి చెందిన గిరీష్ మీనన్, మాజీ యూఎన్ అధికారి వత్సల కుమారుడు..సీఏ చేసి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
ఇక జయరామ్ మలయాళ నటుడు అయినప్పటికీ..తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే. ఆయన నటించిన సినిమాలు చూస్తే..తెలుగు నటుడు అనే ఫీల్ అవుతారు. రీసెంట్ గా జయరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన హాయ్ నాన్నలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు నాన్నగా చేశారు. అలాగే గుంటూరు కారం సినిమాలో మహేశ్‌కు తండ్రి పాత్రలో నటించారు.గతంలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’నూ అల్లు అర్జున్‌కు జయరామ్ తండ్రిగా కనిపించారు.
ఇక ఇటీవలే జయరామ్ హీరోగా నటించిన అబ్రహం ఓజ్లర్ సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా హీరో జయరాం నటనకు ప్రశంసలు అందుకున్నారు.