MANAGALVARAM: మంగళవారం సినిమాలో ముఖ్యపాత్రలో మెరిసిన ఆ అమ్మాయి ఎవరు తెలుసా ?

Divya Pillai: గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న తెలుగు సినిమా మంగళవారం. నిన్న వరల్డ్ కప్ వల్ల కలెక్షన్లు ఈ సినిమాకి తగ్గిన.. మళ్లీ సోపవారం నుంచి జోరు మామూలు అయిపోయింది. 

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ ఎంట బోల్డుగా కనిపించిందో.. ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ బోల్డ్ క్యారెక్టర్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది.

తన పాత్ర మంచిదా కాదా అనేవన్ని పక్కన పెట్టి తాను ఆ పాత్రకి 100 శాతం న్యాయం చేస్తుందా లేదా అని చూస్తుంది పాయల్. దానికి నిదర్శనమే ఆమె అజయ్ భూపతి తో చేసిన సినిమాలు. మంగళవారం సినిమా ఆమె మినహా ఏ హీరోయిన్ చెయ్యమన్న సాహసం చేసి ఉండదేమో. ఈ విషయాన్ని అజయ్ భూపతి కూడా ఈ మధ్య ఈ చిత్రం సక్సెస్ మీట్ లో తెలియజేశారు. కాబట్టి మంగళవారం విజయానికి వందకి వంద శాతం కారణం పాయల్ రాజ్ పుత్. కాగా ఈ సినిమాలో మరో అమ్మాయి పాత్ర కూడా కీలకంగా నిలిచింది.

జమీందారు భార్యగా ఈ సినిమాలో చేసిన అమ్మాయి పాత్ర ఈ సినిమాని కీలక మలుపు తిప్పుతుంది. కాగా ఈ చిత్రం చూసిన వారందరూ ఆమె ఎవరు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

మొదటినుంచి చూడడానికి చాలా అందంగా కనిపించి లాస్ట్ లో మాత్రం అందరిని సర్ప్రైజ్ కి గురి చేసిన ఈమె పేరు.. దివ్యా పిళ్లై. ఆమె మలయాళ నటి. మలయాళంలో దివ్య చాలా సినిమాలే చేసింది. అంతేకాదు ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది. మలయాళం లోనే కాకుండా తమిళంలో కూడా ఒక రెండు సినిమాలు చేసింది దివ్య. కాగా దివ్య తెలుగు ప్రేక్షకులకు కనిపించడం కూడా ఇది రెండోసారి.

నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో సినిమా హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమా సక్సెస్ సాధించకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా సుపరిచితురాలు కాలేదు. కానీ ఇప్పుడు మంగళవారం సక్సెస్ తెలుగు ప్రేక్షకులు సైతం ఆకట్టుకుంది దివ్య. మరి మంగళవారం సక్సెస్ ద్వారా దివ్య కి తెలుగులో కూడా మరిన్ని ఆఫర్లు వస్తాయి ఏమో వేచి చూడాలి.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2023-11-20T13:34:41Z dg43tfdfdgfd