పాయిల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇవ్వటం కలిసి వచ్చింది. ఆదివారం ప్రపంచ కప్ మ్యాచ్ ఉండటంతో థియేటర్లకు జనం రాలేదు. మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే భారీగానే వసూళ్లను కోల్పోయాయి. మొదటి రోజు మంగళవారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏకంగా 2 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల రూపాయలు.. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. సోమవారం ఫర్వాలేదనిపించే కలెక్షన్స్ నమోదు చేసాయి.
ఇక ఈ చిత్రం విడుదలకు ముందే నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది.అందుకు తగ్గట్లుగానే సినిమా అంచనాలు అందుకుని బయ్యర్లు కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నైజాంలో 3.20 కోట్ల రూపాయలు.. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో 7 కోట్ల రూపాయలు.. దేశ వ్యాప్తంగా 2 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 12.20 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మంగళవారం ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ రెండో వారంలో అంటే డిసెంబర్ 10 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేఅవకాశం ఉంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ ఈ విషయమై లేదు. ఓటిటి డేట్ కలెక్షన్స్ చూసి మార్చే అవకాసం ఉందంటున్నారు.
అయితే ఫ్యామిలీలకు ఈ సినిమా కాస్తంత దూరంగానే ఉంటుంది. ముఖ్యంగా దీంట్లోని అక్రమ సంబంధాల వ్యవహారం.. కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు.. హీరోయిన్ కు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. ఈ చిత్రంలో కనిపించే ఓ ప్రత్యేకత ఏంటంటే.. ఇంట్రవెల్ ముందు వరకు పాయిల్ కనిపించకున్నా.. అసలు కథ మొదలు కాకున్నా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ముందుకు నడిపించారు దర్శకుడు అజయ్. శనివారం, ఆదివారం వీకెండ్స్ లో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపితేనే ఈ సినిమాకు కలిసివచ్చినట్లు. తెలుగులో కూడా ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ వీక్ వరకు మంగళవారం హవా కొనసాగనుంది.
2023-11-21T01:11:13Z dg43tfdfdgfd