Mega157 Movie | అనుకున్న దానికంటే భోళా శంకర్ సినిమా ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టింది. చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్ నిలిచింది. ప్రస్తుతం చిరుకు ఒక మంచి హిట్టు కావాలి. అది కూడా ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే భోళాకు విమర్శలు చేసిన వారే.. ఈ సినిమాకు చప్పట్లు కొట్టేలా. దాని కోసం చిరు గట్టిగా ఆలోచించి బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని ముందుగా ప్లాన్ చేసుకున్న వశిష్ట అనుకోని విధంగా చిరు సినిమాను పట్టాలెక్కించాడు.
ఆ మధ్య రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతన్నట్లు ఎప్పటి నుంచో వస్తున్న వార్తలే. కాగా ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. అంతేకాకుండా దాదాపు నలుగురు హీరోయిన్‌లు సినిమా కోసం పనిచేయనున్నారట. అందులో అనుష్క శెట్టి, మృనాళ్ థాకూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ సినిమా ఇదే ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్ మొదలు పెట్టనుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి స్వరాలు అందించనున్నాడు. దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తుంది. అప్పుడెప్పుడో 1994లో వచ్చిన ఎస్.పీ.పరుశురామ్ తర్వాత ఇప్పటివరకు ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇక ఈ సినిమా కంటే ముందుగా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయినట్లు ఇన్‌సైడ్ టాక్. చిరు పెద్ద కుమార్తే సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలను నెలల గ్యాప్‌లోనే రిలీజ్ చేసుకునే విధంగా షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడట చిరు.
2023-09-18T07:27:08Z dg43tfdfdgfd