MOST SCARIEST HORROR MOVIES: గజ్జున వణికించే భయంకరమైన హారర్ సినిమాలు

Most Scariest Horror Movies To Binge Watch: హారర్ మూవీస్ అంటే చాలు ఆమడ దూరం పరుగెత్తే వాళ్లు ఉంటారు.. అదే సమయంలో హారర్ మూవీస్ అంటే ఎగ్గిరి గంతేసి మరి కన్నార్పకుండా చూసే వాళ్లు కూడా ఉంటారు. ఇంకొంత మంది అయితే, ఏకంగా హారర్ సినిమాలు తప్ప మరొక జానర్ లైక్ చేయరు. అది కూడా పని కట్టుకుని మరీ రాత్రి వేళల్లోనే ఈ సినిమాలు చూసి ఎంజాయ్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాంటి వారు ఏదైనా ఒక ప్రత్యేకమైన హారర్ సినిమాను నైట్ టైమ్ చూడగలమా లేదా అని తమని తామే ఛాలెంజ్ చేసుకుంటారన్న మాట. అలాంటి వారి కోసమే ఇదిగో ఇప్పుడు మేం కొన్ని హారర్ సినిమాల జాబితా అందిస్తున్నాం. 

హారర్ సినిమాలను చూసే ధైర్యం ఉన్న వాళ్లయితేనే ఈ సినిమాలు చూసే ప్రయత్నం చేయండి. లేదంటే లైట్ తీస్కోండి. ఎందుకంటే ఈ హారర్ సినిమాలు అంత టెర్రిఫిక్ గా ఉంటాయంటున్నారు ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే హారర్ జానర్ ప్రియులు.

ది ఎక్సార్సిస్ట్ ( 1973 ) : 

హాలీవుడ్ డైరెక్టర్ విలియం ఫ్రైడ్ కిన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద 428.2 మిలియన్ డాలర్ల కలెక్షన్ కొల్లగొట్టింది. ఒయిజా బోర్డ్ అనే ఆట ఆడిన రెగాన్ అనే 12 ఏళ్ల పాపకు దయ్యం పట్టిద్ది. ఆ తరువాత పాప ప్రవర్తించే తీరు అతి భయంకరంగా ఉంటుంది. ఇప్పటికీ ఇంతకంటే భయంకరమైన సినిమా మరొకటి లేదని చెబుతుంటారంటే ఆలోచించండి. అప్పట్లో అమెరికాలో ఈ సినిమాపై నిషేధం కూడా విధించారు. థియేటర్లో సినిమా చూసిన జనంలో కొంతమంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటం, గుండెపోటు రావడం వంటివి జరగడం వల్లే అమెరికా సర్కారు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుందట.

ది టెక్సాస్  చైన్‌సా మసాకరే ( 1974 ) :

టోబ్ హూపర్ అనే దర్శకుడు స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికీ హారర్ సినిమాల్లో ఒక సంచలనం. కేవలం 80 వేల నుంచి లక్షా 40 వేల అమెరికన్ డాలర్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 31 మిలియన్ డాలర్లు రాబట్టిందంటే ఈ సినిమాకు ఉన్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్మశానంలో తమ తాతయ్య సమాధిని సందర్శించడానికి వచ్చిన ఐదుగురు స్నేహితుల బృందానికి ఎదురైన వింత, భయంకరమైన చేదు అనుభవాల సమాహారమే ది టెక్సాస్ చైన్‌సా మసాకరే. ఇలా చెబితే సింపుల్‌గానే ఉంటుంది కానీ... చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.

ది కంజురింగ్ ( 2013 ) : 

జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జస్ట్ 20 మిలియన్ అమెరికన్ డాలర్లతో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద దాదాపు 320 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్ ఒక విధంగా ఆ సినిమా కమెర్షియల్ సక్సెస్ కి కొలమానం అనే చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ అమెరికన్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీకి ఐఎండిబీ కూడా 10 కి 7.5 రేటింగ్ ఇచ్చింది. 

హెరెడిటరీ ( 2018 ) : 

ఆరి ఆస్టర్ అనే డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా జస్ట్ 10 మిలియన్ల అమెరికన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 82.2 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. స్టోరీ విషయానికొస్తే.. ఆనీ అనే యువతి తల్లి చనిపోతుంది. ఆమె మరణంతో ఆనీతో సహా ఇంట్లోవారంతా దిగులుతో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఘటనలు ఆడియెన్స్ ని సీటుకు కట్టేసి సినిమా చూసేలా చేస్తాయి. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడికి ఇదే మొట్టమొదటి ఫీచర్ ఫిలిం అయినప్పటికీ... అతడు డైరెక్ట్ చేసిన తీరు ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా చేసింది.

అలాగే 1978 లో వచ్చిన హాలోవీన్, 1980 లో విడుదలైన ది షైనింగ్ మూవీ, 2002 లో రిలీజైన ద రింగ్, 2012 లో వచ్చిన సైనిస్టర్ వంటి హారర్ సినిమాలు కూడా ఇప్పటికే కాదు.. అతి భయంకరమైన చిత్రాల జాబితాలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరోసారి మరో జాబితాలో మరో ఇంట్రెస్టింగ్ జానర్ గురించి తెలుసుకుందాం.. మళ్లీ కలుద్దాం..

2023-06-05T18:53:06Z dg43tfdfdgfd