NALGODNA | మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన దంపతులను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం..

నల్లగొండ: మార్నింగ్‌ వాక్‌కు (Morning Walk) వెళ్లిన దంపతులు విగత జీవులుగా ఇంటికి తిరిగివచ్చిన ఘటన నల్లగొండలోని పానగల్‌లో (Panagal) చోటుచేసుకున్నది. పానగల్‌కు చెందిన విష్ణు, స్వప్న దంపతులు. రోజులానే మంగళవారం ఉదయం ఉదయసముద్రం (Udaya Samudram) వద్ద మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారు. ఇంతలో ఓ గుర్తుతెలియని వాహనం వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్త జిల్లా దవాఖానకు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఢీకొట్టిన వాహనం గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2023-09-19T04:28:47Z dg43tfdfdgfd