NRI NEWS | సింగపూర్‌లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం

NRI News | సింగపూర్‌లో ఈ నెల 16న శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. `లోకాసమస్త సుఖినో భవంతు` అన్న మహా సత్సంకల్పంతో మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సంప్రదాయ, అనుష్ఠానాలను కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో కొందరు తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడ్డారు. ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు (నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం) నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన (భాద్రపద శుద్ధ పాడ్యమి) నిర్వహించిన ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సింగపూర్‌లోని తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేశారు. మహిళలు అందరు చక్కని సమన్వయంతో వచ్చిన వారికి తీర్ధ ప్రసాదాలు, చక్కటి తెలుగు సంప్రదాయ ప్రసాద విందు ఏర్పాటు చేసారు.

2023-09-19T14:14:27Z dg43tfdfdgfd