NTR | ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌

హైదరాబాద్: నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ (NTR) శతజయంతి సందర్భంగా సినీనటులు బాలకృష్ణ (Balakrishna), జూనియర్‌ ఎట్టీఆర్‌ (Jr. NTR) నివాళులర్పించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో (NTR Ghat) బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు పురంధేశ్వరి, రామకృష్ణ, నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.

ఎన్టీఆర్‌ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారన్నారన్నారు. ముఖ్యమంత్రిగా అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన రూ.2కే కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందని వెల్లడించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని గుర్తుచేశారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని, ఆయన కుమారిడిగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

మహనీయుడికి నీరాజనాలు‌: పవన్‌ కల్యాణ్‌

మాజీ ముఖ్యమంత్రి, నటసామ్రాట్‌ ఎన్టీఆర్‌కు జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని చెప్పారు. తెలుగువారి సత్యా ఢిల్లీ వరకు చాటారని వెల్లడించారు. సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేశారని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలిపారు. మహనీయుడికి తమ పార్టీ తరఫున నీరాజనాలు అర్పిస్తున్నానని చెప్పారు.

2023-05-28T04:36:39Z dg43tfdfdgfd