OMG 2: ఎట్టకేలకి తెలుగులోకి OMG 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా OMG 2 (ఓ మై గాడ్ 2). 2023లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఇప్పటివరకూ పెద్దగా టచ్ చేయని సబ్జెక్ట్‌ను చాలా అద్భుతంగా డిస్కస్ చేశారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కానీ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండేసరికి సౌత్ ఆడియన్స్ నిరాశ చెందారు. తాజాగా వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది జియో సినిమా.

తెలుగుతో పాటు

అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది హిందీతో పాటు తెలుగు, తమిళం, బంగ్లా, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. దీంతో హిందీ రాని సౌత్ ఆడియన్స్‌ కూడా ఈ సినిమా చూసే అవకాశం దక్కింది.

వయాకామ్ 18 స్టూడియోస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, వకావో ఫిల్మ్ ప్రొడక్షన్‌ల సహకారంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో యామీ గౌతమ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. అక్షయ్ కుమార్ శివుడిగా ఈ చిత్రంలో అద్భుతంగా నటంచారు. పంకజ్ త్రిపాఠి-అక్షయ్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆలోచింపజేశాయి. గతంలో వచ్చిన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో 'గోపాల గోపాల'గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్‌ చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T09:27:35Z dg43tfdfdgfd