OMG2 TELUGU OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OMG2 Telugu OTT: తెలుగులో OTTకి వచ్చేసిన సూపర్ హిట్ ఓ మై గాడ్2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay kumar) శివుడిగా ప్రత్యేకపాత్రలో కనిపించిన బ్లాక్ బస్టర్ మూవీ ఓ మై గాడ్ 2(OMG2). నటుడు పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi) ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అమిత్ రాయ్(Amit Rai) తెరకెక్కించారు. గతేడాది ఆగస్టు లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళని రాబట్టింది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి  రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆందోళనలు కూడా చెలరేగాయి. ఈ సినిమాలో ఒక వర్గం వారిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వెలువడ్డాయి. అయినప్పటికి మంచి వసూళ్లు రాబట్టింది ఈ మూవీ.

ఇదిలా ఉంటే.. ఓ మై గాడ్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కేవలం  ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇక అప్పటినుండి ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులు ఎండు కార్డు వేస్తూ ఏప్రిల్ 25 నుండి ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ సినిమాను తెలుగులో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. మరి హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.   

©️ VIL Media Pvt Ltd.

2024-04-25T04:47:05Z dg43tfdfdgfd