PRABHAS: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్

Prabhas: ప్రభాస్ గొప్ప మనసు.. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే రూ.35 లక్షల డొనేషన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఆయన దర్శకుల కోసం ఏకంగా రూ.35 లక్షల రూపాయలు డొనేట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్బంగా ప్రతీ సంవత్సరం ఆ రోజును డైరెక్టర్స్ డే గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకలు ఘనంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇండస్ట్రీకి సంబందించిన ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా ప్రభాస్ కు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లగా.. ఈ వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చాడట. ఇదే విషయాన్నీ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు నాగ్ అశ్విన్ తో కల్కి 2898 AD సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇండియన్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న  ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T06:25:02Z dg43tfdfdgfd