గతేడాది 'యానిమల్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్-రష్మిక మందన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. ఇదే ఊపులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే స్పిరిట్ షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఆ ఇద్దరూ
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సలార్ 2లో కియారా నటిస్తుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో కియారా యాక్ట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో చూడాలి. అయితే స్పిరిట్ సినిమాలో మరో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తోంది. గతంలో ప్రభాస్‌తో యోగి సినిమాలో నయనతార హీరోయిన్గా యాక్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించినట్లు అవుతుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం స్పిరిట్‌కి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ఇటీవల సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం తీయబోతున్నారు. ఇక తొలిరోజే ఈ సినిమా రూ.150 కోట్లు కొల్లగొడుతుందంటూ సందీప్ రెడ్డి ధీమాగా చెప్పారు. "రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ నుంచే ఆ బడ్జెట్‌ను రికవరీ చేస్తాం. ఇక ఈ సినిమా తొలిరోజే ఈజీగా రూ. 150 కోట్ల వసూళ్లు సాధిస్తుంది." అంటూ సందీప్ చెప్పారు. ఈ మాటలకి షాక్ అయిన యాంకర్ అంత కాన్ఫిడెన్సా అంటూ ప్రశ్నించారు. దీనికి కూడా సందీప్ దీటుగా బదులిచ్చారు. "కాన్ఫిడెన్స్ కాదు.. ఇది బిజినెస్. టీజర్, ట్రైలర్, పాటలకి రెస్పాన్స్ బావుంటే ఈజీగా రూ.150 కోట్లు తొలి రోజే వస్తాయ్" అన్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకూ ప్రభాస్ తన కెరీర్లో పోలీస్ రోల్యే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ స్పిరిట్‌పై ఇంట్రెస్టింగ్గా ఉన్నారు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-04-29T05:58:12Z dg43tfdfdgfd