RAM CHARAN UPCOMING MOVIES: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ సినిమాలివే!

Ram Charan Upcoming Movies: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నాడు. ఆయన రాజమౌళి దెబ్బకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది. రామ్ చరణ్ కెరీర్ లో చేయబోతున్న తరువాతి సినిమా విషయానికి వస్తే ఆర్సి 15. ఇప్పటివరకు ఈ సినిమాని అదే పేరుతో సంబోధిస్తూ వచ్చారు కానీ కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అఫీషియల్ గా రిలీజ్ అయింది.

గేమ్ చేంజర్ పేరుతో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో శంకర్ రూపొందిస్తున్నారు. ఇక హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి శంకర్ ఇండియన్ టు సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఈ సినిమా మొదలుపెట్టారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్ల నటిస్తున్నారు.

Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?

శ్రీకాంత్, యోగిబాబు వంటి వారు ఇద్దరు కీలకపాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. శంకర్ అంటేనే భారీ బడ్జెట్ కి పెట్టింది పేరు. ఆయన పాటలకు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ సెట్లు వేయిస్తాడు అనే పేరు ఉంది అయితే దిల్ రాజు అన్ని విషయాల్లోనూ తలదూరుస్తూ ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో సినిమా ముగించే పనిలోనే ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ తన 16వ సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతోందని ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. కొత్త నిర్మాత నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ఈ వెంకట సతీష్ కిలారు సన్నిహితుడుగా చెబుతున్నారు. మొత్తం మీద రామ్ చరణ్ తరువాత రెండు సినిమాలయితే ఫిక్స్ అయ్యాయి. ఆ రెండు సినిమాల కోసం ఆయన అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. 

Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

2023-05-26T12:19:11Z dg43tfdfdgfd