RANA ABOUT VETTAIYAN : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు!

Rana About Vettaiyan : జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే షాక్‌ అయ్యా..ఈ కథ రజనీ మార్క్‌ సినిమా కాదు!

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ‘జై భీమ్‌‌‌‌’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో వెట్టయాన్ (తెలుగులో వేటగాడు)

అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్‌ ఫాజిల్,రానా,మంజు వారియర్,రితికాసింగ్, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌‌ లుక్‌‌కు మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.రానా మాట్లాడుతూ.."ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది.సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సార్‌తో నటించాలనేది నా చిన్ననాటి డ్రీం.ఆయనతో సినిమా చేసే అవకాశం దర్శకుడు టీజే జ్ఞానవేల్ ద్వారా దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా తెలిపారు.

డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్‌ స్టోరీ చెప్పగానే ఒక్కసారిగా నేను షాక్‌ అయ్యాను.చాలా అద్భుతమైన కథ చెప్పి నన్ను ఫస్ట్ సిట్టింగ్లోనే ఇన్‌స్పైర్‌ చేశాడు.ఎంతో పరిశోధన చేసి జ్ఞానవేల్‌ అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకున్నారు. జ్యుడిషియల్‌ వ్యవస్థ నేపథ్యంలో రాసుకున్న ఈ కథ అయితే రజనీ మార్క్‌ సినిమా కాదని రానా తెలిపారు.ఈ సినిమా తలైవా ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా ఉంటుందని..మరో రజినీని చూస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అలాగే అమితాబ్‌జీ కూడా ఈ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఇక ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని రానా వెల్లడించారు. 

జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు.దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T11:01:21Z dg43tfdfdgfd