RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.

RGV: ఇదెక్కడి మాస్ వర్మ.. శ్రీదేవిని చూడటానికి ఏకంగా స్వర్గానికి వెళ్ళాడట.

ఇండియాలో స్వతంత్రం వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) అనే చెప్పాలి. ఆయన గురించి చాలా మంది అనుకునే మాట ఇదే. అందరిలా రొటీన్ గా జీవించడం అంటే ఆయనకీ ఇష్టం ఉండదు. రోజుకోలా ఉంటూ అదరనీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు వర్మ. ఓసారి పోర్న్ అంటే ఇష్టం అంటాడు.. రాజకీయాలపై ట్వీట్స్ చేస్తాడు, పిలిటికల్ సినిమాలు చేస్తాడు.. ఇలా తాను ఏమ్  చేసినా పబ్లిక్ నజర్ మాత్రం తనపై ఉండేలా చూసుకుంటాడు. ఆశ్రమంలో వివాదాలను కూడా రేపుతుంటాడు.

ఇక తాజాగా మరోసారి అలాంటి పనే చేశాడు రామ్ గోపాల్ వర్మ. అదేంటంటే.. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో తన ఫేవరేట్ హీరోయిన్ తో దిగిన ఫోటోను అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలోన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాదు, వివాదాలకు దారితీస్తోంది. అదేంటి.. ఫేవరేట్ హీరోయిన్ తో ఫోటో దిగితే తప్పా అనుకున్నారు కదా.. మరి అక్కడే మీరు పప్పులో కాలేసింది. అందరిలా నార్మల్ ఫోటోను అప్లోడ్ చేస్తే.. ఆయన వర్మ ఎందుకు అవుతాడు. 

అందుకే.. అందరికీ భిన్నంగా అతిలోక సుందరితో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదేంటి శ్రీదేవి చనిపోయారు కదా.. ఆయనతో ఫొటో ఎలా దిగారు అనుకుంటున్నారా. మరి అదే ఇక్కడ మ్యాజిక్కు. చనిపోయిన శ్రీదేవితో కారులో షికారుకు వెళ్తున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో శ్రీదేవి డ్రైవింగ్ చేస్తుంటే.. వర్మ పక్కన కూర్చొని సిగరేట్ తాగుతూ కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. శ్రీదేవిని చూడటానికి స్వర్గానికి వెళ్లాను.. అనే క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది.. వర్మకు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలా అయితేనే మరోసారి సోషల్ మీడియాలో ట్రేడింగ్ లోకి వచ్చాడు వర్మ.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T11:30:57Z dg43tfdfdgfd