SAINDHAV FIRST SINGLE : 'సైంధవ్' ఫస్ట్ సింగిల్ కోసం గ్రాండ్ ఈవెంట్ - రెండు చోట్ల సాంగ్ లాంచ్ ప్లాన్ చేసిన మూవీ టీమ్!

Saindhav First Single: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'సైంధవ్'(Saindhav) ఫస్ట్ సింగిల్ కి  సంబంధించి మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందుకోసం ఏకంగా రెండు వెన్యూస్ ని సెలెక్ట్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ ను రెండు చోట్ల ప్లాన్ చేయడం విశేషం. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'హిట్'(Hit), 'హిట్ 2'(Hit 2)వంటి సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. వెంకటేష్ కెరియర్ లో 75వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అంతేకాకుండా వెంకటేష్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా ఇదే కావడం విశేషం.

చాలా కాలం తర్వాత వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం దగ్గుబాటి ఫాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి నవంబర్ 21న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ వెంకటేష్ చిల్ మోడ్ లో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేయడంతో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైంధవ్ ఫస్ట్ సింగిల్ లాంచింగ్ వెన్యూ తో పాటు డేట్ అండ్ టైం ని మేకర్స్ వెల్లడించారు.

హైదరాబాద్ లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్, VNR VJIT కాలేజీల్లో స్టూడెంట్స్ సమక్షంలో నవంబర్ 21 మధ్యాహ్నం 2, 3 గంటలకు సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కు ఎవరెవరు వస్తున్నారు.. తదితర వివరాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు నమాజుద్దీన్ సిద్ధిక్ విలన్ గా కనిపించనున్నారు. తమిళ హీరో ఆర్య, ఆండ్రియా జెర్మియా, రుహాని శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న  ఈ చిత్రాన్ని మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సలార్'(Salaar) రిలీజ్ కాబోతుండడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. 2024 జనవరి 13న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : ధనుష్ 'కెప్టెన్' మిల్లర్ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది - ఎప్పుడంటే?

2023-11-20T17:18:48Z dg43tfdfdgfd