ఇప్పుడు అందరి దృష్టీ ప్రభాస్ (Prabhas)తాజా చిత్రం సలార్ (Salaar)పైనే ఉంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రెండు పార్టులుగా వస్తోంది. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్‌ను రెడీ చేసుకుంటుంది ప్రభాస్ టీమ్. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 1 న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ ని ఎలా రిలీజ్ చేయబోతున్నారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
మరో పది రోజుల్లో ట్రైలర్ లాంచ్ ఉన్నప్పటికి ..దాని వివరాలు ఏవీ నిర్మాతలు రివీల్ చేయలేదు. ఈ లాంచింగ్ ఏదన్నా గ్రాండ్ ఈవెంట్ గా ప్లాన్ చేసారా లేక క్యాజువల్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ట్విట్టర్ లో లింక్ ఇచ్చి ఊరుకుంటారా అనేది తెలియటం లేదు. అందుకు కారణం...ప్రభాస్ నుంచి రావాల్సిన సమాధానమే అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దాని కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ ఇంకా ఆ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాడు. ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని ఆ బాధతోనే పూర్తి చేశాడు. అయితే ఆ నొప్పి ఇప్పుడు మరింత సమస్యగా మారిందట. ఆదిపురుష్ సినిమా టైములో నడవలేక చాలా బాధ పడుతూ కనిపించిన సందర్భాలు అందరూ చూసినవే.
ఇక ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రభాస్ సర్జరీ కోసం వెళ్ళాడు. సెప్టెంబర్ నెలలో ఈ సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఆపరేషన్ ని అక్టోబర్ లోనే పూర్తి చేసుకున్నాడు. అయితే నెల పాటు విశ్రాంతి అవసరం అవ్వడంతో అక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా రికవరీ అయ్యినట్లు సమాచారం. నవంబర్ 6న హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఇక వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేయనున్నాడట. అయితే ప్రభాస్ ఇంకా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారట. మరికొంతకాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని చెప్పటంతో కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. దాంతో ట్రైలర్ లాంచ్ కు రాకుండా రిలీజ్ టైమ్ దగ్గరపడ్డాక, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అప్పుడు కనపడతారు అంటున్నారు.
ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రభాస్ పెద్ద డిజాస్టర్ అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
మరో ప్రక్క బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు.
2023-11-21T05:11:29Z dg43tfdfdgfd