SCREEN TIME: ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Screen Time: ఆధునిక కాలంలో పిల్లల జీవనశైలి ఎంతో మారిపోయింది. స్కూలు, ట్యూషన్లు అయిపోయాక స్మార్ట్ ఫోన్లు, టీవీలతోనే ఎక్కువకాలం గడిపేస్తున్నారు. పిల్లలు ఎక్కువ కాలం ఇలా స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం పై ఎంతో ప్రభావితం ప్రభావం పడుతుంది. ఒకప్పుడు పిల్లలు తమ తోటి వారితో ఎక్కువగా ఆడుకునేవారు. అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి వారు ఆరోగ్యకరమైన జీవనశైలిలోనే జీవించేవారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లైన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు వాడడం మొదలుపెట్టారు. ఎక్కువ సమయం పాటు వాటిని వాడడం వల్ల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎన్నో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.

ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు ఎక్కువ కాలం పాటు కదలకుండా ఒకే చోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ భోజనం లేదా స్నాక్స్ తింటున్నప్పుడు వారు ఎంత తింటున్నారో కూడా వారికి నియంత్రణ ఉండదు. దీనివల్ల వారు బరువు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటివి పిల్లలకు వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

ఎక్కువగా ఫోన్ చూసే పిల్లల్లో దృష్టి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫోను చూస్తూ పిల్లలు కంటి రెప్పలు వేయడం కూడా మర్చిపోతారు. దీనివల్ల కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు ఫోన్ తక్కువగా ఇవ్వాలి. వారి కళ్ళపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఫోన్ చూసే పిల్లల్లో కళ్ళు మంట దురద అలసట వంటివి కనిపిస్తాయి. అలాగే పిల్లలకు అస్పష్టంగా కనిపించడం కూడా జరుగుతుంది.

ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో నిద్రలేని సమస్య కూడా వస్తుంది. అలాగే వారి జ్ఞాపకశక్తి ,భావోద్వేగాలు ప్రవర్తనలో కూడా మారిపోతాయి. ఇది వారి ఆలోచన శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదువు సరిగా రాదు. కోపం త్వరగా వస్తుంది. మెదడు పై ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మెదడు పనితీరు కూడా మారిపోతుంది. అలాగే వీరిలో సోషల్ స్కిల్స్ కూడా తగ్గిపోతాయి. అంటే సమాజంలో కలిసే నైపుణ్యం తగ్గిపోతుంది. వారి ముఖ కవళికలు మాట్లాడేటప్పుడు వచ్చే స్వరంపై కూడా ఫోన్ చాలా స్క్రీన్ టైమ్ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక స్క్రీన్ సమయం వల్ల పిల్లల్లో దూకుడు ఎక్కువైపోతుంది. దీనివల్ల కోపంతో విరుచుకు పడిపోతుంటారు. చిరాకుగా ప్రవర్తిస్తారు. ఇది మానసిక రుగ్మతలను ఎక్కువగా తీవ్రతరంగా మారుస్తుంది. కాబట్టి పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడమే మంచిది. అధిక స్క్రీన్ సమయం వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

2023-11-21T02:29:28Z dg43tfdfdgfd