టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్ బాబును (Mahesh Babu) పక్కా ఫ్యామిలీ మ్యాన్‌గా పేర్కొంటుంటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండే ఆయన.. ఖాళీ దొరికితే భార్యా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక కూతురు ఆయన సితార (Sitara) చాలా యాక్టివ్ అని తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్ వీడియోలు, డాన్స్ రీల్స్‌తో సోషల్ మీడియాలో సొంతంగా ఐడెంటిటీ తెచ్చుకుంది. అంతేకాదు తండ్రి మహేష్‌తో కలిసి ‘సర్కారు వారి పాట’ చిత్రంలో పెన్నీ సాంగ్‌కు స్టెప్పులేసింది. అయితే ఫ్యూచర్లో తాను ఫిలిం స్టార్ అవుతుందా? అనేది తెలియదు కానీ.. తాజాగా అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌పై (Biggest Ad Contract) సంతకం చేసిన ఫస్ట్ ఇండియన్ స్టార్ట్ కిడ్‌గా (First Indian Star Kid) రికార్డ్ సృష్టించింది.
సితార ఘట్టమనేని రీసెంట్గా ప్రెస్టీజియస్ జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి (PMJ Jewellery) ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ఈ ఎండార్స్‌మెంట్‌కు సంబంధించిన కాంట్రాక్ట్ కోసం సితారకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రైవసీ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే 3 రోజుల పాటు ఒక సీక్రెట్ ప్లేస్‌లో ఈ యాడ్ ఫిల్మ్‌ను రిచ్ లెవెల్లో చిత్రీకరించారు. అంతేకాదు ఇండియాలోనే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ కమర్షియల్ యాడ్ షూట్లో పాల్గొనడం విశేషం.
కాగా.. రాబోయే రోజుల్లో టెలివిజన్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఈ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్ క్యాంపెయినింగ్ మొదలవనుంది. ఇక తమ కూతురు సితారకు సంబంధించిన ప్రోగ్రెస్ పట్ల మహేష్, నమ్రత దంపతులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ సైతం థమ్సప్ వంటి కమర్షియల్ యాడ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
100510443
ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే, శ్రీలీల ఫిమేల్ లీడ్స్‌గా కనిపించనుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత మహేష్.. దిగ్గజ దర్శకులు రాజమౌళి సినిమా చేయనున్నారు. ఈ కథ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ మేకింగ్ కోసం హాలీవుడ్ ఫిలిం స్టూడియోలతో చర్చలు జరుపుతున్నారు జక్కన్న.
Read latest Tollywood updates and Telugu News
2023-05-26T11:44:33Z dg43tfdfdgfd