SITARA GHATTAMANENI: చిన్న వయసులోనే బడా ప్రాజెక్టు.. సరికొత్త రికార్డు సెట్ చేసిన సితార

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Jewellery Ad Contract: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే చందాన సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టుకుంటూ వస్తుంది. ఆమె చిన్నప్పుడు మాట్లాడిన ముద్దు ముద్దు మాటలు అన్నీ కూడా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఆమెకి చిన్ననాటి నుంచే అభిమానులు పెరుగుతూ వచ్చారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యి కొన్ని డాన్స్ వీడియోలు కూడా ఆమె షేర్ చేస్తూ వస్తోంది. అలాగే తన కుటుంబ సభ్యులకి సంబంధించిన అప్డేట్స్ పంచుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇక ఆమె అరుదైన ఘనత అందుకుంది తెలుస్తోంది. అదేమంటే సితార ఘట్టమనేని పీఎంజే జ్యువెలరీ బ్రాండ్ కి సంబంధించిన ఒక కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?

ఆమె యాడ్లో కనిపించేందుకుగాను ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మూడు రోజుల షూట్ కోసం ఆమెకు భారీ ఎత్తున అమౌంట్ చెల్లించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. అందుకు ఆమె తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వారికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన షూట్ కూడా జరిగినట్లు చెబుతున్నారు. త్వరలోనే సదరు జువెలరీ బ్రాండ్ అధికారికంగా సితార ఘట్టమనేని ఫోటోలను కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక మహేష్ బాబు తన కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఉంటే షూటింగ్లో ఉంటారు లేకపోతే కుటుంబంతోనే సమయం గడపడానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. షూటింగ్ గనక గ్యాప్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏదో ఒక విదేశాలకు ఫ్యామిలీతో వెళ్లి అక్కడ వారితో క్వాలిటీ టైం గడిపేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ మే 31వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. 

Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 

2023-05-26T15:19:14Z dg43tfdfdgfd