SOUTH INDIAN RICHEST ACTOR: రజిని, కమల్, చిరంజీవిని వెనక్కి నెట్టి.. మొదటి స్థానం సంపాదించుకున్న నాగార్జున..

South Indian Richest Actor : సౌత్ ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు…ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు.. సీనియర్ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి అధికారం యూనరేషన్ తీసుకుంటున్న సీనియర్ హీరోల్లో ముందుంటారు. కాగా ఆ తరువాత జనరేషన్ ఈరోజు అయినా విజయ్, అజిత్, మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచే అంతరిమినరేషన్ తీసుకుంటున్నారు.

‘జైలర్’ సినిమాకి రజనీకాంత్ రూ.110 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంతేకాదు రజినీకాంత్ ఆస్తి కూడా దాదాపు 500 కోట్లు ఉంటాయి. మరో పక్క తమిళ హీరో విజయ్ హీరో కోసం ఏకంగా రూపాయలు 130 కోట్లు తీసుకుంటే, 

’ఇండియన్ 2′ కోసం కమల్ హాసన్ రూ.150 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

మరోపక్క మన తెలుగు హీరోల్లో ప్రభాస్ రూ.100 కోట్లు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాదాపు 80 కోట్ల వరకు భారీ మొత్తంలోనే పారితోషికాలు తీసుకుంటున్నారు. అయితే  వీరందరినీ వెనక్కి నెట్టేసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతుడైన హీరోగా మరో హీరో నిలవడం విశేషం.

ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా.. ఆయన మరెవరో కాదు మన గ్లామర్ కింగ్ అక్కినేని నాగార్జున. సౌత్ ఇండియాలో అత్యంత రిచెస్ట్ యాక్టర్ గా రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి వారిని కూడా వెనక్కి నెట్టేసి మొదటి స్ధానంలో నిలబడ్డారు నాగార్జున. GQ (మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నాగార్జున.. సినిమాలలో అలానే బిజినెస్ లో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. కాగా  ఆయన నికర ఆస్తి విలువ రూ.3010 కోట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం నాగార్జున హీరోగా, నిర్మాతగా, టీవీ హోస్ట్‌గా, బిజినెస్ మేన్‌గా రాణిస్తున్నారు.‌ ఇక ఆయన చేస్తున్న సినిమాలకు 9 కోట్ల నుండి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో పక్క నిర్మాణ సంస్థ కూడా ఉంది.   అన్నపూర్ణ స్టూడియో ద్వారా నిర్మాతగా వ్యవహరిస్తూ కూడా నాగార్జున బాగానే సంపాదిస్తున్నారు. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఈ మధ్య వచ్చాయి. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి జట్టుకు సహ యజమానిగా ఉన్నారు ఈ అక్కినేని హీరో. ఇక ప్రస్తుతం నాగార్జున నివసిస్తున్న బంగ్లా దాదాపు రూ.45 కోట్ల విలువ కలిగింది అని తెలుస్తోంది. ఇక నాగార్జున కి ఓ ప్రైవేటు జెట్, కార్లు కూడా ఉన్నాయి.

ఇక నాగార్జున తరువాత స్ధానాన్ని కూడా అనుకోని హీరోనే సంపాదించారు. నాగార్జున తరువాత రెండవ స్థానంలో విక్టరీ వెంకటేష్ నిలిచారు. ఇక మూడవ స్థానాన్ని చిరంజీవి దక్కించుకున్నారు. వెంకటేష్ నికర ఆస్తి విలువ రూ.2200 కోట్లు కాగా.. చిరంజీవి ఆస్తి విలువ రూ.1650 కోట్లు అని సమాచారం. ఇక నాలుగవ స్థానంలో రామ్ చరణ్, తరువాత స్ధానాల్లో దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, అల్లు అర్జున్ వంటి స్టార్లు నిలిచారు.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2023-11-20T13:34:41Z dg43tfdfdgfd