Suresh Babu : తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని నిర్మాత దుగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు. అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదన్నారు. తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఓ సినిమా ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా స్పందించలేదు. చంద్రబాబు ది అక్రమ అరెస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు స్పందిస్తూంటే.. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో సాయం చేసిన చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. అయితే కేఎస్ రామారావు, రాఘవేంద్రరావు వంటి ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది స్పందించలేదు. దానికి సినీ పరిశ్రమ పెద్దగా సురేష్ బాబు స్పందించారు. సున్నితమైన విషయాలు అయినందున తాము మాట్లాడలేమని.. గతంలోనూ మాట్లాడలేదని చెబుతున్నారు.
2023-09-19T08:25:36Z dg43tfdfdgfd