TILLU SQUARE X REVIEW: టిల్లుగాడి రచ్చ షురూ.. ఆడియన్స్ ఏమంటున్నారు?

Tillu square X Review: టిల్లుగాడి రచ్చ షురూ.. ఆడియన్స్ ఏమంటున్నారు?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్వ్కేర్(Tillu square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టిల్లు స్వ్కేర్ సినిమా ఎలా ఉంది? టిల్లు గాడు ఈసారి ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించాడు? సినిమా చూశాక ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Also read : టీజర్‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ 

ఇవాళ ఉదయమే ఓవర్ సీస్ తోపాటు చాలా చోట్ల షోస్ పడటంతో సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి టిల్లు స్వ్కేర్ సినిమా గురించి వాళ్ళు ఏమంటున్నారంటే? ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. సినిమా చాలా బాగుందని, సిద్దు వన్ మ్యాన్ షో తో ఆదరగొట్టేశాడని చెప్తున్నారు. మరి కొందరేమో.. టిల్లు స్వ్కేర్ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉందని, టిల్లు రచ్చ మరోసారి కేకపుట్టించిందని, అనుపమ గ్లామర్ సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గాను, సెకండ్ హాఫ్ ట్విస్టులు నెక్స్ట్ లెవల్ అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. మరోసారి టిల్లుగాడు రచ్చ చేశారని తెలుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.

2024-03-29T04:43:33Z dg43tfdfdgfd