Crime News: మద్యం మత్తులో కూతుర్ని చంపిన తండ్రిరిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలం సిర్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రకుంటతండాకు చెందిన ముడావత్ సురేష్(25) బతుకుదెరువు కోసం భార్య వసతి, కూతురు నందిని (2)సంవత్సరాల పాపతో కలిసి రెండు నెలల క్రితం సంగారెడ్డికి వచ్చారు. కంది బజార్ లో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.
సురేష్ ఎలాంటి పనిచేయకుండా మద్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. భార్య వసతి కంది బజార్లోని ఓ వైన్స్ దగ్గర మిర్చి బండి వద్ద పనిచేస్తుండేది. 14న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సురేష్ వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి తన కూతురు నందిని వెంట తీసుకొని ఇంటికి వెళ్లాడు. రాత్రి 10 గంటలకు భార్య వనిత ఇంటికి వచ్చి చూడగా నందిని విగతజీవిగా పడి ఉన్నది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ పాప చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
నిందితుడు సురేష్ ను సంగారెడ్డి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఇంట్లో మద్యం తాగుతుండగా ఏడ్చిందని, ఎంత ఓదార్చినా వినకపోవడంతో ఆగ్రహంతో తాను చెంపలపై, ముఖంపై, మెడపై కొట్టి తలను నేలకేసి కొట్టడంతో చనిపోయిందని అంగీకరించాడు. చిన్నారి నందిని తల్లి వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు సురేష్ ను ఆదివారం రిమాండుకు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ జె.రమేష్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
2023-09-19T12:39:29Z dg43tfdfdgfd