TTD: శ్రీవారి దర్శనాలు కల్పిస్తానని భక్తుల నుంచి లక్షలు మోసం చేసిన కేటుగాడు అరెస్టు.. ఎలా చేశాడంటే?

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా ఖ్యాతి ఉన్నది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు శ్రీవారిని ఎక్కువగా దర్శిస్తుంటారు. ఇదే అదునుగా తీసుకుని ఓ కేటుగాడు మోసాలకు తెరలేపాడు. తాజాగా పోలీసులు ఆ మోసగాడిని అరెస్టు చేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలహంకకు చెందిన మోసగాడు హెచ్ మారుతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసగాడు శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు గుంజాడు.

కర్ణాటకకు చెందిన నలుగురి వద్ద నుంచి రూ. 42 వేలు ఇందుకోసం తీసుకున్నాడు. ఇలాగే మరో అడ్వకేట్ దగ్గర కూడా డబ్బులు దండుకున్నాడు. బళ్లారికి చెందిన ఓ అడ్వకేట్‌కు లైఫ్ టైం డోనార్ టికెట్లు ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకోసం రూ. 28 లక్షల టోపీ పెట్టాడు.

Also Read : Caste: కాబోయే భర్త ఇంటిలో నవవధువు మృతి.. తక్కువ కులం అని చంపేశారు: యువతి తల్లిదండ్రులు

వీరంతా ఈ కేటుగాడిని నమ్మడానికి ఓ బలమైన కారణం ఉన్నది. టీటీడీ బోర్డ్ మెంబర్‌ వద్ద ఈ మారుతి పీఆర్వోగా పని చేశాడు. తన పొజిషన్‌ను అక్రమంగా ఉపయోగించుకున్నాడు. తానే టీటీడీ బోర్డు మెంబర్ అని బిల్డప్ ఇస్తూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఈ మోసగాడిని పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఒక టీం ఏర్పాటు చేశారు. మారుతీ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందంది. దీంతో తిరుమల టూ టౌన్ పోలీసులు మారుతీని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2023-11-20T14:25:26Z dg43tfdfdgfd