VIJAYAKANTH: ఆస్పత్రిలో చేరిన విజయ్ కాంత్ .. ఆందోళనలో అభిమానులు..!

సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు  విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన  అనారోగ్య సమస్యతో చెన్నై లోని మయత్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చాలా కాలం నుంచి మధుమేహ సమస్య తో బాధపడుతున్న కారణంగా ఆయన కాలి వేళ్ళకు రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు విజయ్ కాంత్ కాలి వేళ్ళను తొలగించారు. అంతే కాదు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం కాస్త క్షీణించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్‌ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్‌ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యపరిస్థితి బాగలేకపోవడంతో... డీఎంకే వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సినిమా రంగంలో నటుడుగానే కాకుండా నిర్మాత, దర్శకునిగా కూడా మంచి గుర్తింపు పొందారు. 1991లో 100 వ చిత్రం “కెప్టెన్ ప్రభాకరన్” సినిమాతో విజయ కాంత్ ను కెప్టెన్ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు. 40 ఏళ్ళ సినీ జీవితంలో 100 కు పైగా సినిమాల్లో నటించి గొప్ప నటుడిగా ప్రేక్షకుల ఆదరణను పొందారు. సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన విజయ కాంత్.. 2005 లో DMDK పార్టీనీ స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.

2023-11-20T07:25:51Z dg43tfdfdgfd