VIRAL VIDEO: ముసలోన్ని పెళ్లి చేసుకున్న యువతి.. చివరలో షాకింగ్ ట్విస్ట్

కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిలను పెద్దవాళ్లు పెళ్లి చేసుకోవడం చాలా సాధారణంగా జరిగేది. తర్వాత సమాజ ధోరణి మారింది. అనంతరం పెళ్లికి నిర్ణీత వయసు ఉండాలని చట్టాలు చేశారు. యువతీ యువకుల కనీస వివాహ వయసును పెంచేశారు. అయితే ముసలోళ్లు యువతులను పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ కొన్నిచోట్ల కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో, ఈ మాటలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇందులో వయసులో చాలా పెద్దవాడైన ఒక వ్యక్తి యుక్త వయసు యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు చూడవచ్చు. వధూవరులు కెమెరాలకు చాలా యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అయితే ఈ వీడియోలో వధూవరులు, అతిథులు ఎవరూ పెళ్లిలో సంతోషంగా కనిపించడం లేదు. దీని వల్ల పెళ్లి బలవంతంగా జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజమైన కారణం ఇంకా బయటపడలేదు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో సింగర్ అడ్డి కళ్యాణ్ పాడిన "వార్నింగ్" పాట వినిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారనే వివరాలు బయటకు రాలేదు.

సోషల్ మీడియాలో చాలా మంది ఈ జంట మధ్య వయస్సు వ్యత్యాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి "అసలు ఈ కాలం అమ్మాయిలకు ఏమైంది, ఇలా ఎందుకు చేస్తున్నారు?" అని ప్రశ్నించాడు. దీన్ని చూసి సమాజం చాలా అసహ్యానికి గురైందని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి పెళ్లిళ్లు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయి? అని మరి కొంతమంది ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వాలు ఇలాంటి పెళ్లిళ్లలో జోక్యం చేసుకొని వీటిని ఆపాలని ఇంకొంతమంది డిమాండ్ చేశారు. ఈ వివాహాల కారణంగా ఆడవారి జీవితాలు నాశనం అవుతాయని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

స్క్రిప్టెడ్ వీడియో వైరల్

కొంత కాలం క్రితం ఇలాంటి ఒక స్క్రిప్టెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో, ఒక వృద్ధుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆ యువతి తన కోడలు అని చెబుతాడు. ఆమె భర్త మరణించిన తర్వాత ఈ పెళ్లి జరిగిందని వివరిస్తాడు. మామను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగినప్పుడు... తనకు ఎవరూ చూసుకోవడానికి లేరని, అందుకే ఇష్టం లేకపోయినా వృద్ధుడిని పెళ్లి చేసుకున్నానని చెబుతుంది. ఆరున్నర నిమిషాల వీడియో ముగిసే సమయానికి, అది ఒక నాటకం అని తెలిసిపోతుంది. వీడియో చివరిలో దీనికి సంబంధించిన డిస్‌క్లైమర్‌ కూడా చూపిస్తారు.

80 ఏళ్ల వృద్ధుడితో 34 ఏళ్ల మహిళ పెళ్లి

ఇటీవల బలురామ్ అనే 80 ఏళ్ల వృద్ధుడు, 34 ఏళ్ల షీలా పెళ్లి చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో జరిగిన ఈ పెళ్లి చాలామందికి షాక్ ఇచ్చింది. బలురామ్ స్నేహితుడు విష్ణు సహాయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియోలను అప్‌లోడ్ చేసేవాడు. ఆ ఫన్నీ వీడియోలను చూసి షీలా బలురామ్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. వారిద్దరూ ప్రేమలో పడి చివరికి, సుస్నెర్ పట్టణంలో పెళ్లి చేసుకున్నారు.

2024-05-02T10:00:09Z dg43tfdfdgfd