VIRAL VIDEO: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు

viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు

వెంటనే అప్రమత్తం అవ్వడం వల్ల రైల్వేలో ఓ పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై వెళ్తున్న అర్చన ఎక్స్ ప్రెస్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇంజన్ లేని బోగీలు అలాగే ప్రయాణించాయి. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులకు కూడా ఈ విషయం తెలియదు. తాము ఉన్న బోగీలకు ఇంజన్ లేదు అని తెలిసిన వెంటనే ప్యాసింజర్ల భయాందోళనకు  గురై ట్రైన్ ఆగగానే దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటన మే5న పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పంజాబ్‌లోని ఖన్నాలో పాట్నా నుంచి -జమ్మూ తావికి వెళ్తున్న అర్చన ఎక్స్‌ప్రెస్ ట్రైన్  నెం.12355 కోచ్‌లు ఇంజన్ విడిపోయాయి. ఇంజిన్ లేని కోచ్‌లను గుర్తించిన కీమాన్ వెంటనే అలారం మోగించాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కోచ్ లు లేకుండా వెళ్తున్న ఇంజన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిలిపివేశారు. తర్వాత బోగీలను ఇంజన్ కు అటాచ్ చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ వార్త విన్నవారంత షాక్ కు గురవ్వుతున్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-07T05:18:36Z dg43tfdfdgfd