VISHWAMBHARA: చిరంజీవి సినిమాకి నో చెప్పిన పాపులర్ హీరోయిన్.. కారణం అదే

Chiranjeevi Vishwambhara: ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కొన్ని డిజాస్టర్ సినిమాల కారణంగా కెరియర్లో బాగా డీల పడిపోయారు. టాలెంట్ ఉన్న హీరోయిన్లలో విజయశాంతి కూడా ఒకరు. కానీ రాజకీయాలలోకి వెళ్లిపోయిన విజయశాంతి సినిమాలకి దూరంగానే ఉన్నారు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చారు. 

ఆ చిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి విజయశాంతి ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని చురకలు కూడా అంటించారు. సరిలేరు సినిమాలో మహేష్ బాబు తో నటించిన విజయశాంతికి తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా ఒక భారీ ఆఫర్ వచ్చిందట. కానీ ఈ పాత్ర కోసం విజయశాంతి పొలైట్ గా నో చెప్పినట్లు తెలుస్తోంది. 

త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతికి ఒక మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికిందట. కానీ విజయశాంతి మాత్రం ఈ సినిమాకి నో చెప్పేసారు. మళ్ళీ చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని వద్దనుకున్నారు. 

ఒకవైపు విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు కానీ తన తదుపరి సినిమాల్లో తన పాత్రల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. గతంలో మంచి హీరోయిన్లుగా చలామణి అయిన సుమలత, బిగ్ బాస్ మాధవి వంటి వారు అడపాదడపా పాత్రలు చేస్తూనే ఉన్నారు. కానీ విజయశాంతి మాత్రం వారిలో ఒకళ్ళ లాగా వెళ్లడం లేదు. 

నిజానికి సరీలేరు నీకెవ్వరూ సినిమా సమయంలోనే ఈ సినిమా చేసి మళ్లీ వెనక్కి రాజకీయాల్లోకి వెళ్లిపోతానని విజయశాంతి స్పష్టంగా చెప్పారు. అందుకనే విశ్వంభర సినిమాకి కూడా రాములమ్మ నో చెప్పిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

ఆ సమయంలో చిరంజీవి కాకుండా మరే హీరో అయినా కూడా విజయశాంతి అదే జవాబు చెప్పి ఉండేవారు అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం విజయశాంతి కంప్లీట్ గా సినిమాలకి దూరం కాలేదని ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు నచ్చిన పాత్ర ఏమైనా వస్తే చేయడానికి రెడీ గానే ఉన్నట్లు చెబుతున్నారు. 

ఏదేమైనా అప్పట్లో హిట్ కాంబినేషన్ లలో అయిన చిరంజీవి విజయశాంతి కూడా ఉండేవారు. మరి వీళ్ళిద్దరిని మళ్లీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం అభిమానులకు వస్తుందో లేదో చూడాలి.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-04-25T07:29:50Z dg43tfdfdgfd