IPL 2024: అంపైర్లతో గొడవ.. సంజూ శాంసన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మ్యాచులో హైడ్రామా నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఔట్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అంపైర్ నిర్ణయంతో అసహనానికి గురైనా శాంసన్.. గ్రౌండ్‌లోనే ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. క్రీజును వీడేందుకు నిరాకరించాడు. చివరకు ఫీల్డ్ అంపైర్లు సర్ది చెప్పడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే సంజూ శాంసన్ క్లియర్‌గా నాటౌట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

222 పరుగుల భారీ లక్ష్య చేధన‌కు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌ను సంజూ శాంసన్ ఆదుకున్నాడు. పవర్ హిట్టింగ్‌తో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతడు సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. సంజూ శాంసన్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద షై హోప్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు.

అయితే క్యాచ్ పట్టిన తర్వాత షై హోప్.. తనను తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌ను తాకినట్లు వీడియోలో కనిపించింది. దీంతో తాను ఔట్ కాదని శాంసన్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంపైర్ల నిర్ణయంపై రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజూ ఔట్ అయ్యే వరకు రాజస్థాన్ పోటీలోనే నిలిచింది.. కానీ అతడు ఔట్ అయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓటమిపాలైంది.

అంపైర్ల తప్పుడు నిర్ణయంతోనే సంజూ ఔట్ అయ్యాడనీ.. అదే రాజస్థాన్ ఓటమికి కారణమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్లియర్‌గా నాటౌట్ అంటూ వీడియోలను పంచుకుంటున్నారు.

అయితే ఔట్ విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంజూ శాంసన్‌పై ఐపీఎల్ నిర్వహకులు చర్యలు తీసుకున్నారు. అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T04:24:39Z dg43tfdfdgfd