అనుష్క, త్రిష, సమంత ఎవ్వరూ అందుకోలేని రెమ్యునరేషన్..నయనతారకి మాత్రమే ఎలా సాధ్యం, ఆమె స్ట్రాటజీ ఇదే

క్రేజ్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో ఇతర నటీనటులు ఎవరూ ఆమెని అందుకోలేకున్నారు. నయనతార ప్రస్తుతం ఒక చిత్రానికి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఇది దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ అనే చెప్పాలి.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2022లో  తన ప్రియుడు విగ్నేష్ తో నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. 

నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.  గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇలా నయనతార కెరీర్ బిగినింగ్ నుంచి ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే ఉంది. 

నయనతార పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగిటివిటి ఎదుర్కొంది. లవ్ ఎఫైర్లు, వివాదాలు ఇవేమి నయనతార కెరీర్ కి అడ్డంకి కాలేదు. పెళ్ళైన తర్వాత కూడా నయనతార క్రేజ్ రవ్వంత కూడా తగ్గలేదు. సాధారణంగా హీరోయిన్లకు వివాహం జరిగితే వారి కెరీర్ లో వారి జోరు తగ్గుతుంది అనే అభిప్రాయం ఉంది. కానీ నయనతార ఇప్పటికీ సౌత్ లో శిఖరాగ్రాన ఉంది. 

క్రేజ్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో ఇతర నటీనటులు ఎవరూ ఆమెని అందుకోలేకున్నారు. నయనతార ప్రస్తుతం ఒక చిత్రానికి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఇది దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఈ రేంజ్ రెమ్యునరేషన్స్ బాలీవుడ్ లో మాత్రమే చూస్తుంటాం. కానీ నయనతార తొలిసారి 10 కోట్లు అందుకుంటున్న సౌత్ హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. 

సౌత్ లో సమంత, త్రిష, కాజల్ అగర్వాల్ అనుష్క, పూజా హెగ్డే, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారి రెమ్యునరేషన్ 3 నుంచి 4 కోట్ల వరకు మాత్రమే ఉంటుంది. అయితే నయనతార మాత్రమే 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదగడానికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. కోలీవుడ్ లో కొందరు నిర్మాతలు దీనిపై స్పందించారు. 

నయనతార రెమ్యునరేషన్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాదట. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమె కంప్లీట్ రెమ్యునరేషన్ అందుకుంటుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్ర టైంలో ఆమె రెమ్యునరేషన్ 5 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు 10 కోట్లు అయింది. రెమ్యునరేషన్ తో పాటు నయనతార అనేక నిబంధనలు కూడా పెడుతుంది. వాటన్నింటికీ ఒకే అయితేనే సినిమా చేస్తుందట. లేకుంటే లేదు. 

కానీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల విషయాల్లో నయన్ ఒక స్ట్రాటజీ పాటించింది. తాను మెయిన్ లీడ్ గా నటించే చిత్రాలకు అంత రెమ్యునరేషన్ అందుకుంటే సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. కాబట్టి తానూ కమర్షియల్ చిత్రాలకు అందుకునే రెమ్యునరేషన్ లో సగం మాత్రమే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తీసుకునేదట. దీనితో ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు O 2, కర్తవ్యం, కోలమవు కోకిల లాంటి చిత్రాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. దీనితో నయనతారకి స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్ తో ఆమె కమర్షియల్ చిత్రాలకు 10 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందని కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. 

2024-04-25T07:57:29Z dg43tfdfdgfd