ఆహ్లాదపరిచే నాగావళి రివర్ వ్యూ పార్క్.. ఇదే..!!

పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇంటి పాటున ఉండటం కుదరదు. ఏదో ఒక పిక్నిక్ స్పాటుకి తీసుకు వెళ్లాల్సిందే. లేకుంటే వీళ్ల అల్లరిని ఏ పెరంట్స్ భరించలేరు. అందుకనీ ఎక్కడ టూరిస్టు ప్లేసులు బాగుంటాయ అని గూగుల్ సాయంతో సెర్చు చేస్తుంటారు. అయితే ఓ వైపు సమ్మర్ మరో వైపు ఆహ్లదాన్ని పంచే ప్లేస్ అయితే బాగుండు అని అందరు ఆలోచిస్తుంటారు. మరి అలాంటి స్పాటే మన శ్రీకాకుళంలో ఉంది. అది ఎక్కడో చూసేయండి. మీ పిల్లలను అక్కడికి తీసుకువెళ్తే మిమ్మల్నీ మెచ్చుకోకుండా ఉండరు.

శ్రీకాకుళం పట్టణం శాంతి నగర్ కాలనీలో నాగావళి నది ఒడ్డున ఈ రివర్ వ్యూ పార్క్ ఉంది. పిల్లలు, పెద్దలు అందరిని ఆకట్టుకొనే విధంగా ఉంది. ఇక్కడ ఎంట్రీటిక్కెట్ పది రూపాయలు. సాయంత్రం నాలుగు గంటలు నుండి తొమిది గంటలు వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు కోసం ఉయ్యాలలు, రాక్, క్లయింబింగ్ జరుడు బల్లలు, కార్ రైడ్ ఉన్నాయి. పెద్దలు కోసంఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ ఇక్కడ ప్రత్యక ఆకర్షణగా ఉంది.

ఇక్కడ ఏ టిఫిన్ అయినా రూ.20 మాత్రమే..

ఈ ట్రాక్ చుట్టూ చెట్లుఒకవైపు మరోవైపు నాగావళి నది ఉంటుంది. దీని నుండి వచ్చే చల్లని గాలి పార్క్ వచ్చే వారిని ఆహ్లాదకరంగా ఉంచుతోంది. నాగావళి రివర్ వ్యూ పార్క్ లో ఆటలు ఆడి అలసిపోయిన పిల్లలకోసం ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ స్నాక్స్, డ్రింక్స్, ఐ స్క్రీమ్స్ మొదలగునవి లభిస్తాయి. అంతే కాకుండా ఈ మధ్య ఈ పార్క్ లో కొత్త జంటలు పెళ్లికి ముందు ప్రెవెడ్డింగ్ షూట్ వంటివి తరచు ఈ పార్కులో జరుగుతున్నాయి.

వాట్ ఎ ఐడియా సర్ జీ .. ఈ రైతు ఆలోచనతో లాభాలు గడిస్తున్నారు.. అదెలాగంటే !

శ్రీకాకుళం మున్సిపాలిటీ వారు ఈ పార్క్ ను అభివృద్ధి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్ కంటేనాగావళి రివర్ వ్యూ పార్క్ కు సందర్శకుల తాకిడి ఎక్కువుగా ఉంటుంది. శని, ఆదివారంలో ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడకు ఎక్కువ మంది ప్రజలు రావడానికి చల్లటి గాలి ఒక వైపు ఐతే ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఫస్ట్ షో అని రోజు ఏదో ఒక సినిమాను ప్రదర్శిస్తారు. ఆదివారం సాయంత్రం రోజు పార్క్ వచ్చిన పిల్లలు కోసం డాన్స్ మ్యూజిక్ షోస్ ను ఏర్పాటు చేస్తారు.

2024-04-29T07:47:51Z dg43tfdfdgfd