ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు

ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ .. ఫీజు చెల్లింపునకు ఇయ్యాలే ఆఖరు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గురువారంతో గడువు ముగుస్తుందని హైదరాబాద్​జిల్లా ఇంటర్​విద్యాధికారి దాసరి వడ్డెన్న తెలిపారు. ఫస్ట్ ఇయర్, సెకండ్​ఇయర్​లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు,  ఇంప్రూవ్​మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజులు చెల్లించాలని సూచించారు. స్టూడెంట్ల నుంచి ఫీజులు తీసుకుని, ఏదైనా కారణంతో ఎగ్జామ్స్ కు అప్లయ్ చేయకపోతే ఆయా కాలేజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వడ్డెన్న హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T02:59:34Z dg43tfdfdgfd