ఈ రామాలయం పై హనుమంతుడి ప్రదక్షిణలు .. అదెలాగో తెలుసుకుందామా !

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఊరూ వాడ రాములోరి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. జిల్లాలోని ఆలయాలన్నీ రామ నామంతో మారుమ్రోగిపోయాయి. భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరిగాయి. శ్రీ సీతారామచంద్రస్వాముల వారి కళ్యాణోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని జిల్లాలో పలుచోట్ల భారీ శ్రీరాముడి విగ్రహాలతో శోభాయాత్రలు, ఊరేగింపులు నిర్వహించారు.

అయితే నిర్మల్ జిల్లాలోని కౌట్ల(కె) గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. నిర్మల్ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో కొత్తగా శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ప్రతిష్టాపన మహోత్సవాన్నికూడా నిర్వహించారు. అయితే ఈ సందర్బంగా హనుమాన్ మాలధారులు వినూత్నంగా ఆలోచించి పంట పొలాలకు రసాయనాలను పిచికారి చేసేందుకు ఉపయోగించే డ్రోన్ సహాయంతో ఆంజనేయ స్వామి ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసినట్లు తిప్పారు.

లోక కళ్యాణం కోసమే మా కళ్యాణం... లోకల్ 18 తో హిజ్రాలు

థర్మకోల్ తో తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమను డ్రోన్ కు కట్టారు. తర్వాత ఆ డ్రోన్ ను గాలిలో ఎగురవేసి ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసినట్లు తిప్పారు. డ్రోన్ సహయంతో పైకి ఎగిరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆంజనేయస్వామి ప్రతిమను గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఆంజనేయ స్వామి అలయం చుట్టు చేసిన ప్రదక్షిణల వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కూడా కొడుతోంది.అయితే నిర్మల్ జిల్లాలోని కౌట్ల(కె) గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు.

రంగులు మారే చీర.. సిరిసిల్ల జిల్లా వాసి అద్భుత ఆవిష్కరణ..

నిర్మల్ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో కొత్తగా శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ప్రతిష్టాపన మహోత్సవాన్నికూడా నిర్వహించారు. అయితే ఈ సందర్బంగా హనుమాన్ మాలధారులు వినూత్నంగా ఆలోచించి పంటపొలాలకు రసాయనాలను పిచికారి చేసేందుకు ఉపయోగించే డ్రోన్ సహాయంతో ఆంజనేయ స్వామి ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసినట్లు తిప్పారు. థర్మకోల్ తో తయారు చేసిన ఆంజనేయ స్వామి ప్రతిమను డ్రోన్ కు కట్టారు. తర్వాత ఆ డ్రోన్ ను గాలిలో ఎగురవేసి ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసినట్లు తిప్పారు. డ్రోన్ సహయంతో పైకి ఎగిరి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆంజనేయస్వామి ప్రతిమను గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఆంజనేయ స్వామి అలయం చుట్టు చేసిన ప్రదక్షిణల వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కూడా కొడుతోంది.

2024-04-18T02:34:47Z dg43tfdfdgfd