ఊహించని రిస్క్ లో ఎన్టీఆర్, రాంచరణ్.. గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలకి లాభాలు రావాలంటే అదొక్కటే మార్గం

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఏదో అవుతుందని ఆశిస్తే ఇంకేదో అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాల గురించి చర్చ ఎక్కువైంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏళ్ల తరబడి నత్తనడకగా షూటింగ్ జరుపుకుంటోంది. 

 

ఊహించని విధంగా ఆలస్యం అవుతుండడంతో ఈ మూవీపై మెగా అభిమానులు సైతం ఆసక్తిని కోల్పోతున్నారు. ఏ అంశంలో కూడా గేమ్ ఛేంజర్ చిత్రంపై ఇంతవరకు అంచనాలు ఏర్పడలేదు. అయితే గేమ్ ఛేంజర్ చిత్రానికి మరో చిక్కు వచ్చి పడింది. షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో బడ్జెట్ అంతకంతకు పెరిగిపోతోందట. 

 

ప్రస్తుతం పెరిగిన బడ్జెట్ కారణంగా గేమ్ ఛేంజర్ చిత్రానికి రిలీజ్ టైంలో మరిన్ని ఇబ్బందులు తప్పవని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని డెఫిషిట్ బడ్జెట్ లో రిలీజ్ చేయాల్సిందే అని అంటున్నారు. హిందీలో విజయం సాధిస్తే సినిమా హిట్ అవుతుంది లేకుంటే లేదని అంటున్నారు. 

 

ఇక ఎన్టీఆర్ దేవర చిత్రానికి కూడా ఊహించని విధంగా బడ్జెట్ పెరిగిపోయింది. ముందుగా ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అది కాస్త 400 కోట్లు దాటేసిందట. అయితే దేవర చిత్రం కొంత వరకు సేఫ్. ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశా జనకంగా ఉంది. కానీ అది సరిపోదు. ఏఈ చిత్రం హిట్ కావాలన్న, లాభాలు రావాలన్నా హిందీలో భారీ వసూళ్లు సాధించాల్సిందే అని అంటున్నారు. 

 

ముందు జాగ్రత్తగా హిందీ రిలీజ్ కోసం దేవర చిత్ర యూనిట్ కరణ్ జోహార్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా వైడ్ గా రాంచరణ్,ఎన్టీఆర్ కి తిరుగుండదు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తమ చిత్రాలకు లాభాలు తీసుకురావడమే కష్టంగా మారింది. 

 

ఇందులో దర్శకుల, నిర్మాతల వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందనేది వాస్తవం. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ మూవీ విషయానికి వస్తే శంకర్ మరో వైపు ఇండియన్ 2 తో బిజీగా ఉండడం మైనస్ గా మారింది. 

2024-04-29T05:58:05Z dg43tfdfdgfd