ఒక్క పాటతో యూట్యూబ్ స్టార్‌గా మారిన యువకుడు!

ఇతని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించాయి. కేవలం ఒక్క పాటతోనే యూట్యూబ్ స్టార్ గా మారిన ఈ యువకుడు ఏడాది కాలం పాటు యూట్యూబ్ లో ఎందుకు కనిపించడం లేదు. ఎవరైనా ఫేం వచ్చి యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ వస్తే కనీసం రెండు మూడు రోజులకు అయినా ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ నుండి మని ఏర్న్ చేస్తారు. కానీ ఇతను మాత్రం ఒకే పాటతో ప్రేక్షకుల మనసుని మెప్పించి యూట్యూబ్ నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న ఇతను కొంత కాలంగా యూట్యూబ్ కి దూరంగా ఉంటున్నాడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన సాయికుమార్... మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్ లో కాంటాక్ట్ ఉద్యోగం చేస్తాడు .ఇక సాయి కుమార్ కి చిన్నప్పటి నుండే పాటలు రాయడం అన్నా, పాటలు పాడటం అన్నా.. యాక్టింగ్ చేయడం అన్నా.. చాల ఇష్టం. తన టాలెంట్ నిరూపించుకోవాలి ఎన్నో రోజులు కష్టపడి డబ్బులు జమ చేసి జీ డి కె ట్యూన్స్ అనే పేరుతో యట్యూబ్ లో ఛానల్ నీ క్రియేట్ చేసి.. తన సొంత డబ్బులతో ఒక పాటను రాయించి.. ఆ పాటకి సాయికుమార్ యాక్టింగ్ చేసి తన యూట్యూబ్ లో విడుదల చేశాడు. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారి 16 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతే సాయికుమార్ రాత్రి రాత్రికే స్టార్ గా మారిపోయాడు. ఆ పాటకి యూట్యూబ్ నుండి కొన్ని డబ్బులు కూడా వచ్చాయి.

మళ్ళీ యూట్యూబ్ ఎందుకు కనిపించలేదు....

యూట్యూబ్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో రోజులు కష్టపడి ఒక పాటను రిలీజ్ చేసాను. అనుకున్న దానికంటే పదింతలు ఎక్కువ గుర్తింపునిచ్చింది అని సాయి కుమార్ తెలిపాడు. మళ్ళీ యూట్యూబ్ లో కనిపించకపోవడానికి కారణం టాలెంట్ లేక కాదు ఒక పాట రిలీజ్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అంత మొత్తం డబ్బులు పెట్టుపెడి చెస్ స్థోమత లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాను అని సాయికుమార్ లోకల్ 18 తో చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వారు గుర్తిస్తే వారికి నేను రాసుకున్న మంచి పాటలు అందిస్తానని సాయి కుమార్ తెలిపాడు.

తొలి పాటకే పాటకే గుర్తింపు ఎలా అనిపించింది?

చాలా మంది యూట్యూబ్ రాణించాలి అని వీడియోస్ చేస్తుంటారు. కానీ రాణించలేకపోతున్నారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక్క పాట మాత్రమే రిలీజ్ చేసాను. ఇంతలా ఆదరణ వస్తుందని అనుకోలేదు. కానీ ఒక్క పాటకే గుర్తింపు వచ్చి యూట్యూబ్ నుండి మానిటైజేషన్ ఓపెన్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి. అది ఎంతో ఆనందంగా ఉంది అని సాయికుమార్ తెలిపాడు. ఇంకా నేను రాసుకున్న పాటలు రిలీజ్ అయిన పాటకన్న మంచిగా ఉంటాయి. ఇంకా గుర్తింపు ఇస్తాయని నమ్ముతున్నాను అని సాయికుమార్ అన్నాడు.

2024-05-06T10:30:44Z dg43tfdfdgfd