ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

ఓ కొత్త లోకం చేరి ఆడుకుందాం

వరలక్ష్మీ శరత్‌‌ కుమార్  నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి’.  అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా చెయ్యి పట్టుకోవే..’  అనే పాటను విడుదల చేశారు. ఇందులో వరలక్ష్మీ తల్లి పాత్రలో కనిపిస్తోంది. తన  కూతురితో కలిసి సరదాగా గడుపుతూ సాగిన ఈ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గోపీ సుందర్ కంపోజ్ చేయగా, అమృత సురేష్ పాడిన తీరు ఆకట్టుకుంది. ​‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా.. మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా.. ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా’ అంటూ రెహ్మాన్ క్యాచీ లిరిక్స్ రాశాడు. వరలక్ష్మీ కూతురి పాత్రలో బేబీ నివేక్ష నటించింది. ఈ చిత్రంలో కుమార్తె కోసం తల్లి పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని మేకర్స్ చెప్పారు.  గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపీ,  రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-23T05:24:50Z dg43tfdfdgfd