కుమార్తెకు విడాకులు.. బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్లిన తండ్రి

పెళ్లి అంటే ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా జరుపుతారు. కానీ ఆ పెళ్లి పెటాకులు అయి.. విడాకులకు దారి తీస్తే మాత్రం ఆ సంతోషం కాస్తా దుఃఖాన్ని మిగుల్చుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి.. విడాకులు తీసుకుంటే అత్తింటి నుంచి ఆ భార్య పుట్టింటికి వెళ్తుంది. ఇక కొందరు తల్లిదండ్రులు అయితే విడాకులు తీసుకున్న కుమార్తెలను ఇంటికి కూడా రానివ్వరు. దీంతో వారు వేరుగా ఉండటమో లేక ఏం చేయాలో తోచక ప్రాణాలు తీసుకోవడమో జరుగుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే.. చాలా జంటల్లో ఎక్కువ ప్రభావం మహిళలపైనే పడుతుంది. అయితే తన కుమార్తెకు అలాంటి పరిస్థితి రావద్దని భావించిన ఓ తండ్రి.. అత్తింటి నరకం నుంచి పుట్టింటికి వస్తున్న తరుణంలో ఆమెను బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా తీసుకెళ్లాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

కాన్పూర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి.. విడాకులు తీసుకున్న తన 36 ఏళ్ల ఉర్విని సంతోషంగా పుట్టింటికి తీసుకెళ్లిన సంఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారింది. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ఉర్వి ఇంజనీర్‌గా పనిచేస్తోంది. 2016 లో ఉర్వికి పెళ్లి చేయగా.. ఆమె అత్తింటికి వెళ్లింది. అయితే ఉర్వి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లినప్పటి నుంచి ఆమెకు అక్కడ వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం వారు తీవ్రంగా హింసించినట్లు అనిల్ కుమార్ తెలిపారు.

దాదాపు 8 ఏళ్లపాటు కొట్టడం, వేధించడం, అవమానించడంతో ఉర్వి 8 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు అనుభవించింది. దీంతో విరక్తి వచ్చి భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28 వ తేదీన కోర్టు.. ఉర్వి దంపతులకు విడాకులు మంజూరు చేసింది. తన వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని.. అయినా అవేవీ సత్ఫలితాలను ఇవ్వకుండా ఆ బంధం తెగిపోయిందని.. విడాకుల నోటీసుల్లో తన కష్టాలను ఉర్వి వివరించింది. ఉర్వికి ఒక కుమార్తె కూడా ఉండగా.. ఆమెను కూడా తనతోపాటు పుట్టింటికి తరలించారు. కుమార్తె, మనవరాలి రాక కోసం తాము ఎదురుచూస్తున్నట్లు ఉర్వి తల్లి కుసుమలత సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తన కుమార్తె ఉర్వికి మద్దతుగా నిలిచిన తండ్రి అనిల్ కుమార్.. ఈ సమాజంలో ఉన్న కట్టుబాట్లను పక్కన పెట్టి.. విడాకులు తీసుకున్న తన కుమార్తెను ఘనంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు విడాకులు తీసుకున్న మహిళలకు అండగా పుట్టింటి వారు నిలవాలనే సందేశాన్ని ఇచ్చేందుకే తాను తన కుమార్తెను బ్యాండ్ బాజాలతో పుట్టింటికి తీసుకెళ్తున్నట్లు అనిల్ కుమార్ వెల్లడించాడు. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే కుమార్తెల పట్ల మరింత జాగ్రత్తగా, మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు అనిల్ కుమార్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కుమార్తెను

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-30T13:59:01Z dg43tfdfdgfd