కమల్ పై నిర్మాత, దర్శకుడు కేసు, పాత మేటరే ఇప్పుడు చుట్టుకుంది

భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. 

కెరీర్ ప్రారంభం నుంచీ విలక్షణ సినిమాలతో, విభిన్న పాత్రలతో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్.  ఆయన నటించి, నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రం  మొదట్నుంచీ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చివరకు విడుదల విషయంలోనూ అయోమయానికి గురైంది.  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మరి ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడింది. ఇప్పుడు ఇన్నాళ్ల  తర్వాత ఈ సినిమా నిమిత్తం కమల్ పై కేసు నమోదైంది. కేసు ఎవరు పెట్టారు..కారణం ఏమిటో చూద్దాం. 

తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌పై నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. 2015లో 'ఉత్తమ విలన్' చిత్రాన్ని  రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఉత్తమ విలన్‌ చిత్రానికి నిర్మాతలుగా కమల్‌ హాసన్‌, తిరుపతి బ్రదర్స్ అధినేతలు  లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ అనే విషయం తెలిసిందే.

 

'ఉత్తమ విలన్' సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు  లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్‌ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. భారీ అంచనాలతో నిర్మించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కొద్దిరోజుల క్రితం ఆయన అన్నారు. ఉత్తమ విలన్‌ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో రూ. 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్‌ హాసన్‌ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్న విషయం తెలిసిందే. 

 

 ‘‘ఉత్తమ విలన్‌’ వల్ల మేము భారీగా నష్టపోయాం. అందుకు పరిహారంగా రూ.30 కోట్ల బడ్జెట్‌లో మాతో ఒక సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారు. మా మధ్య ఒప్పందం కుదిరింది. ‘క్షత్రియ పుత్రుడు’, ‘విచిత్ర సోదరులు’ వంటి చిత్రం చేయాలనుకున్నాం. ఈమేరకు కమల్‌ మాకొక కథ చెప్పారు. వారం వారం కథ మార్చేస్తుండేవారు. గతంలో ఆయన అలా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, నిర్మాతగా ఉండటం వల్ల అది నాకెంతో ఇబ్బందిగా మారింది. 

 

కమల్‌ ఇచ్చిన మాట ప్రకారం తమతో ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయలేదని వారు చెప్పారు. ఉత్తమ విలన్ భారీ నష్టాన్ని పూడ్చేందుకు మరో సినిమాను నిర్మిస్తానని కమల్‌ తమ సంస్థకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. ఇన్నేళ్లలో అనేక  కథలతో పాటు 'దృశ్యం' రీమేక్‌ చేద్దామని కమల్‌ వద్దకు వెళ్లినా కూడా సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడంలేదని లింగుస్వామి అంటున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో కమల్‌ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. 

 

‘ఉత్తమ విలన్‌’ ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత తాను పలు మార్పులు సూచించానని లింగుస్వామి తెలిపారు. తొలుత అంగీకరించిన కమల్.. ఎలాంటి మార్పులు చేయకుండానే దానిని విడుదల చేయమన్నారని చెప్పారు. ‘ఉత్తమ విలన్‌’ వల్ల తాము లాభాలు చూశామంటూ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన కథనాలను ఖండిస్తూ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌ సంస్థ  స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. ఆ కథనాల్లో నిజం లేదని పేర్కొంటూనే ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని తెలిపింది.

   

తమిళ సినీ వర్గాల ప్రకారం ఈ చిత్రం రిలీజ్ రోజు నాటికి 40 కోట్లు అప్పు ఉంది. దాంతో ఫైనాన్సర్స్ రిలీజ్ చేయటానికి అంగీకరించలేదు. చివరి నిముషాల్లో నిర్మాత లింగు స్వామి అప్పు గురించి బయిటపెట్టారు.దాంతో వెంటనే తమిళ నిర్మాతల మండలి , సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, శరత్ కుమార్(సౌత్ ఇండియా మూవీ ఆర్టిస్ట్స్ అశోశియేషన్) కలిసి పనిచేసి ఈ సమస్య నుంచి సినిమాని బయిటపడేసే ప్రయత్నం చేసారు. చివరకు కమల్ ..మరో సినిమాని లింగు స్వామి కు చేసేలా ఎగ్రిమెంట్ కుదుర్చుకుని సినిమాని బయటు తీసుకు వచ్చారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ... నేను తెలుగు రైట్స్ తీసుకునేటప్పుడు ఈ అప్పులు గురించి తెలియదు .. శుక్రవారం రిలీజ్ ఆగటం వల్ల ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మొదట్లో ఉత్తమ విలన్ మే ఒకటవ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారమే తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడులో చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల సొమ్మును థియేటర్ల యజమానులు తిరిగి చెల్లించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడమే చిత్రం విడుదలలో చిక్కులు ఏర్పడినట్లు సమాచారం.

 

 కమల్‌హాసన్‌ హీరోగా రమేశ్‌ అరవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌’. జయరాం, కె.బాలచందర్‌, ఆండ్రియా, పూజాకుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమల్‌హాసన్‌ దీనికి కథ అందించారు. తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మించాయి. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది.

2024-05-04T01:17:16Z dg43tfdfdgfd