కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కాస్ గంజ్(యూపీ): కరసేవకులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓటర్లను ప్రశ్నించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రతిపక్షాలు హాజరు కాకపోవడంతో ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని కాస్​గంజ్​లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందినప్పటికీ కొంత మంది హాజరు కాలేదు. వారందరూ కరసేవకులపై కాల్పులు జరిపిన వారే. ఈ సంగతి వారికి కూడా తెలుసు. మీకు రెండు వర్గాలను ఎన్నుకునే అవకాశం ఉంది. రామ భక్తులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా. కాంగ్రెస్, రాహుల్ బాబా, సమాజ్ వాదీ పార్టీ రామ మందిర అంశంపై 70 ఏండ్లకు పైగా నాన్చివేత ధోరణీని అవలంభించాయి. మోదీని మీరు రెండోసారి ప్రధానిని చేయగానే రామ మందిరానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది”అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్ని వెనుకబడిన వర్గాలను విస్మరించాయని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రధాని కాగానే వారికీ హక్కులను కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్లకు ఎల్లప్పుడు మద్దతిస్తారని చెప్పారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు. అందుకు ఎవరిని అనుమతించదు. ఇది మోదీ గ్యారంటీ”అని వెల్లడించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T02:47:40Z dg43tfdfdgfd