కారు యాక్సిడెంట్‌ తర్వాత శర్వానంద్ రియాక్షన్..సండేపై టాలీవుడ్ హీరో కామెంట్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ (Sharwanand)తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించారు. ఆదివారం ఉదయం జరిగిన కారు యాక్సిడెంట్‌ చాలా చిన్నదని..తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని..కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా ఆరోగ్యంగానే ఉన్నానని సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ పెట్టారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై తన ఆరోగ్య పరిస్థితిపై చింతించాల్సిన పనిలేదని కోరారు. తనకు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఆందోళన చెందిన మీ అందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు నటుడు శర్వానంద్. చివరగా ఆదివారం(Sunday) అందరికి గొప్పదని కామెంట్ పెట్టాడు యంగ్ హీరో.

నాకేం కాలేదు..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ఆదివారం ఉదయం ప్రమాదానికి గురైంది. తన రేంజ్ రోవర్ కారులో ఇంటికి వెళ్తుండగా... తెల్లవారు జామున 3 గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు నంబర్ 45లో కారు అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో స్వయంగా హీరో సోషల్ మీడియా ద్వారా మెసేజ్ ఇచ్చాడు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని..చిన్న దెబ్బలే తగినట్లుగా తెలిపాడు.

కంగారుపడొద్దన్న హీరో..

నటుడు శర్వానంద్ డ్రైవర్‌తో కలిసి వెళ్తుండగా ఓ టూవీలర్ రాంగ్ రూట్‌లో రావడం వల్ల... కారును సడెన్‌గా ఆపే క్రమంలో... డ్రైవర్.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఫలితంగా టూవీలర్‌కి ఏమీ కాలేదు. ఘటన స్థలాన్ని చేరుకున్న జూబ్లీహిల్స్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి... డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించారు. డ్రైవర్ మద్యం సేవించలేదని గుర్తించారు. కారు స్వల్పంగా మాత్రమే దెబ్బతినడంతో పోలీసులు వదిలిపెట్టినట్లు తెలిసింది.

Ram Charan: రామ్ చరణ్ కొత్త బ్యానర్‌పై ఫస్ట్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేసిన మేకర్స్

సండే అందరికి మంచిదని కామెంట్..

అయితే శర్వానంద్‌కు గతంలో కూడా సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడు. పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్‌లో క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు చాలా రోజులు రెస్ట్ తీసుకున్నాడు. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ అయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.

2023-05-28T09:42:58Z dg43tfdfdgfd