కీర్తి సురేష్ తో ఉన్న అబ్బాయి నాకు తెలుసు... పెళ్లిపై తండ్రి కీలక వ్యాఖ్యలు!

కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారని పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ సన్నిహితంగా కనిపించారు. దీంతో ఎఫైర్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ ఫోటో ఉన్న వ్యక్తిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ స్పందించారు. 

ఆయన మాట్లాడుతూ... కీర్తి సురేష్ తో ఉన్న అబ్బాయి నాకు కూడా తెలుసు. వారు మంచి మిత్రులు. ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వాడు. నా కూతురు ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోబోతుందని కథనాలు రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ నిరాధార కథనాలు. కీర్తికి పెళ్లి కుదిరినప్పుడు అందరికీ తెలియజేస్తాము. ఇలాంటి నిరాధార కథనాలు రాయకండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సురేష్ ఫిల్మ్ డైరెక్టర్. కీర్తి తల్లి మేనక హీరోయిన్ కాగా ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. 

కీర్తి సైతం ఇటీవల పెళ్లి పుకార్లపై స్పందించారు. నా పక్కన ఉన్న మిస్టరీ మాన్ నా ఫ్రెండ్. నా మిస్టరీ మాన్ గురించి చెప్పడానికి సమయం ఉంది, అని ఆమె వెల్లడించారు. ఇక కీర్తి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు.  ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. 

అలాగే తమిళంలో జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న మామన్నన్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. అమెజాన్ ఒరిజినల్ చిన్ని మూవీలో సీరియల్ కిల్లర్ గా అలరించారు.తల్లి వారసత్వాన్ని నిలబెడుతూ కీర్తి స్టార్ గా ఎదిగారు. 

2023-05-28T07:31:32Z dg43tfdfdgfd