గెలిపించండి.. అలా చేయకుంటే శిక్షించండి.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే అభ్యర్థి !

బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటూ పొలిటికల్ తెర మీదకు వచ్చారు.. వివి లక్ష్మీనారాయణ. అసలు వివి లక్ష్మీనారాయణ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ చాలా మందికి వివి లక్ష్మీనారాయణ అంటే తెలుసు. అయితే ఇంటి పేర్లు కాకుండా వృత్తి పేరును తన పేరు ముందు చేర్చుకుని ప్రసిద్ధికెక్కారు. జాయింట్ డైరెక్టర్.. జెడి అనే పేరును ఆయన ఇంటి పేరుగా పిలిచే విధంగా మార్చేసుకున్నారు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి‌న లక్ష్మీనారాయణ గతంలో ఐదేళ్ల క్రితమే పాలిటికల్ లైఫ్ లోకి ప్రవేశించారు. పాలిటిక్స్ లో వస్తూనే జనసేన పార్టీలో చేరి 2019లో ఆయన విశాఖ ఎంపీగా పోటీచేశారు.

అనూహ్య పరిణామాల మధ్య 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అందులోనూ ఓటమిపాలైనా మొదటిసారి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థిగా ఆయనకు మంచి ఓట్లు వచ్చాయి. విశాఖపట్నంలోని అటు 4 నియోజకవర్గాలైన తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలు, ఇటు గాజువాక, భీమిలి ఎస్ కోటలో కూడా మంచి ఓట్లు వివి లక్ష్మీనారాయణకు వచ్చాయి. మొదటిసారి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన మంచి ఓట్లు రాబట్టుకున్నారు. దాదాపు ఏడు నియోజకవర్గాల్లోనూ మిగతా రెండు పార్టీల అభ్యర్థులు.. అంటే టిడిపి.. వైసిపి అభ్యర్థుల కన్నా మంచి ఓట్ బ్యాంకుని అప్పట్లో సాధించారు. పలు సమీకరణాలు ఆ ఎన్నికల్లో ఆయనను ఓటమిపాలు చేశాయి.

2019 తర్వాత ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న వివి లక్ష్మీనారాయణ 2023లో జై భారత్ నేషనల్ పార్టీ స్ధాపనకి కృషి చేశారు. కట్ చేస్తే.. 2024లో ఇప్పుడు జై భారత్ పార్టీ స్థాపించి.. ఆ పార్టీ అధ్యక్షుడిగా.. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు విశాఖపట్నంలో పోటీ చేస్తున్నారు. విశాఖలో వైసీపీ నుంచి ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు అటు బిజెపి, జనసేన,టిడిపి కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు ఉత్తర నియోజకవర్గం లో బరిలో ఉన్నారు. అయితే వివి లక్ష్మీనారాయణ మాత్రం తనదైన శైలిలో కొత్త పంథా తో ముందుకు వెళుతున్నారు. బాండ్ పేపర్ కమిట్మెంట్ రాజకీయాలతో తను ముందుకు వెళ్తున్నారు.

Vizag Train: ఈ రైలు ఎక్కితే చాలు... వైజాగ్ సిటీ అంతా ఒక్క రౌండ్‌లో చూడొచ్చు

ఇదే విషయమై వీవీ లక్ష్మీనారాయణను న్యూస్ 18 ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయగా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటే అవి రాజకీయాలు కావని.. బాండ్ పేపర్ రెస్పాన్సిబిలిటీ అని నొక్కి వక్కాణించారు. తాను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులా కాకుండా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని లక్ష్మీనారాయణ చెప్పారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాలు నెరవేరుస్తానని.. ఆ హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అదే విధంగా ఒకవేళ తాను చెప్పినవి అమలు చేయకపోతే.. గెలిచిన తర్వాత ఐదేళ్లలో తాను చెప్పినవి హామీలు నెరవేర్చకపోతే తన పైన కేసు వేయొచ్చని.. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన ప్రజలకు మనవి చేశారు. ముఖ్యంగా తన బాండ్ పేపర్ కమిట్మెంట్ దీని కోసమేనని లక్ష్మీనారాయణ చెప్పారు.

Mangoes: ఈ మామిడి కాయలకు మార్కెట్లో భలే గిరాకీ.. కారణం ఇదే!

ఇదే కాకుండా లక్ష్మీనారాయణ కొన్ని రాజకీయ సంబంధ విషయాలు మాట్లాడారు. తాను పోటీ చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ పొలిటికల్ పార్టీకి డ్యామేజ్ అయ్యేలా తాను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం లేదని చెప్పారు. అలాగే ప్రజలకు మంచి చేయాలని నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వివరించారు. గతంలో ఎంపీగా చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో తన రిప్రజెంటేషన్ కావాలి కాబట్టే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. ఇక తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు లక్ష్మీనారాయణ.

2024-05-02T07:14:53Z dg43tfdfdgfd