ఘనంగా దాసరి జయంతి

ఘనంగా దాసరి జయంతి 

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌‌‌‌లో శనివారం జరిగిన ఈ  కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, మెహర్ రమేష్,  విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావును స్మరించుకుంటూ, ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే  డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌‌ను ఈ నెల 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T02:26:17Z dg43tfdfdgfd