చిరంజీవి అందుకే రాజకీయాల్లో సక్సెస్ కాలేదు..తాను గమనించిన విషయాన్ని సూటిగా చెప్పిన సునీల్

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. సునీల్ కి హీరోగా ఇక తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో డౌన్ ఫాల్ మొదలయింది. వరుస పరాజయాలతో సునీల్ తిరిగి క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. 

ఆ మధ్యన సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ్ముడికి అండగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు జనసేన పార్టీ తరుపున పిఠాపురం లో ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 

ఈ తరుణంలో మరోసారి చిరంజీవి రాజకీయ ప్రస్థానం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సునీల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నేను చిత్ర పరిశ్రమ కి వచ్చింది చిరంజీవి గారి వల్లే. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే నేను ఇక్కడికి వచ్చాను. 

అన్నయ్య నాకు సహాయం చేసినట్లు నేను ఎవరికీ చేయలేనేమో. అంత ఓపిక ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారిని చాలా మంది పొలిటికల్ గా సక్సెస్ కాలేదు కదా అని కామెంట్స్ చేస్తుంటారు.. ఒకే ఆయన పాలిటిక్స్ లో సక్సెస్ కాలేదు. ఆయన వర్క్ లో ఆయనే టాప్. సినిమా రంగంలో చిరంజీవి గారే నంబర్ 1. తన సొంత ట్యాలెంట్ తోనే చిరంజీవి గారు సినిమాల్లో నంబర్ వన్ అయ్యారు. 

రాజకీయాల్లో కూడా పదిమందికి ఉపయోగపడుతూ సక్సెస్ కావాలని అనుకున్నారు. కానీ రాజకీయాలు అనేవి సొంత ట్యాలెంట్ పై ఆధారపడి ఉంది. పొలిటికల్ గా సక్సెస్ కావాలంటే చాలా అంశాలు, చాలా మంది వ్యక్తుల పై ఆధారపడి ఉంటుంది. సినిమాల్లో ఆయన సొంత ట్యాలెంట్ తో దూసుకెళ్లారు. 

కానీ రాజకీయాల్లో ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు రాంగ్ స్టెప్ వేసినా చాలు అంతా.. కొలాప్స్ అవుతుంది అని సునీల్ తెలిపారు. ఆ విధంగా చిరంజీవి చుట్టూ  ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది అని సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

2024-05-02T11:55:49Z dg43tfdfdgfd