తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే సినారెకు ఇంతటి ఖ్యాతి తెచ్చింది - లోకల్18 తో సినారె గ్రామస్తులు!

తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన గొప్ప మహనీయుడు, భారతదేశ అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు,పద్మ భూషణ్ గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి (సినారె)పై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతుల కుమారుడు సి.నారాయణరెడ్డి (సినారె) పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి..తనది రైతు కుటుంబం. సి నారాయణరెడ్డి 1931 సంవత్సరం 29జూలై మాసంలో జన్మించారు.2017 సంవత్సరం జూన్12 వ తేదీ రోజున హైదరాబాదులో మృతి చెందారు.

తెలుగు భాషపై తనకున్న అపారమైన గౌరవం,తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన మహానీయుడు కళా ప్రపూర్ణ పద్మభూషణ్ పద్మశ్రీ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ అవార్డును 1988 సంవత్సరంలో విశ్వంభరకు ఈ అవార్డు వచ్చింది. 2 రాష్ట్రస్థాయిలో సాహిత్యానికి నంది అవార్డ్స్ వచ్చాయి. హనుమాజీపేట గ్రామంలో సి నారాయణరెడ్డి ఇంటిని లోకల్18 సందర్శించగా.. అతను రాసిన రచనలు కవితా సంపుటలు అనేకం ఉన్నాయి. అయితే అతని ఇంటి ప్రాంతంలోనే కవిత కర్పూర క్షేత్రం పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా డాక్టర్ సి.నారాయణరెడ్డి పనిచేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి.

ఈ సందర్భంగా సి. నారాయణ రెడ్డి చిన్నతనంలో ఎలా ఉండేవాడు అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం లోకల్18 చేయగా .. హనుమాజీపేట గ్రామానికి చెందిన కాటం ఆది రెడ్డి అనే వృద్ధుడు మాట్లాడుతూ.. తాను చిన్నతనం నుంచి గాలి పాటలు,జానపద పాటలు, నాటకాలు వేసి ఎందుకు ఆసక్తిగా ఉండేవాడినని, సి నారాయణరెడ్డి తల్లి బుచ్చవ్వ.. తాను పాడుతున్న జానపద పాటలు గాలి పాటలను మెచ్చుకుంటూ.. సి నారాయణరెడ్డి కి నానా.. ఆదిరెడ్డి తాత బాగా పాడుతాడు అంటూ పరిచయం చేసిందని, తల్లి బుచ్చమ్మకు కూడా జానపద కళలు,పాటలు, నాటకాలు అంటే ఎంతో ఇష్టమని, మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిందని తల్లి ప్రోత్సాహంతోనే సి నారాయణ రెడ్డి కవిగా,రచయితగా గొప్ప స్థాయిలోకి వెళ్లాడని ఆది రెడ్డి చెప్పారు.

ఏకంగా రూ.50 వేలు.. రైతులకు గుడ్ న్యూస్, ఇలా చేస్తే చాలు!

తాను చిన్నతనం నుంచి వ్యవసాయంతో పాటు పలు వ్యవసాయం సంబంధించిన పశువులు కాయడం తదితర పనులు చేస్తుండే సమయంలో కూడా సినారే తో కలివిడిగా ఉండేవాడని, పల్లె పాటలు జానపద పాటలు అంటే అప్పటి నుంచే సి నారాయణ రెడ్డికి ఇష్టంగా ఉండేదని వాటిని అతను కూడా సింది,దాసరి బాగోతం,కలలు ఆటపాటలు అంటే ఇష్టమని,తమతో కూడా పాటలు పాడించుకునేవాడని చెప్పారు. ఆ రోజుల్లో తమ గ్రామంలో పాఠశాల లేదని పక్కా గ్రామమైన లింగంపల్లిలో ఓ పాఠశాల ఉండేదని అక్కడే సి.నారాయణరెడ్డి విద్యను అభ్యసించాడని, తర్వాత పై చదువులకు సిరిసిల్లతో పాటు కరీంనగర్,హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాడని వారు తెలిపారు.

మహిళలు, మగవారు, స్టూడెంట్స్‌‌కు డబ్బే డబ్బు.. ఇలా చేస్తే రూ.లక్షల్లో సంపాదన!

సి నారాయణరెడ్డి కి రక్షకుడిగా (అంగరక్షకుడిగా) గత 15 సంవత్సరాలుగా పని చేశానని రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుల గ్రామానికి చెందిన నాగరాజు లోకల్18కి వెల్లడించారు.నారాయణరెడ్డి కినాటుకోడి చికెన్,చేపలు అంటే చాలా ఇష్టమని, ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగులోనే మాట్లాడాలని, ఎప్పుడు కూడా కోపానికి రాకూడదంటూ తనకు ఎప్పుడూ చెప్తుండేవారని నాగరాజు గుర్తుచేసుకున్నారు. తన తాత నారాయణరెడ్డి సార్ వద్ద 55 సంవత్సరాలపాటు పనిచేశాడని అన్నారు. సి నారాయణ రెడ్డి సారు ఎప్పుడూ కూడా తెలుగు భాష గొప్పతనాన్ని గురించి వివరించేవారని, సార్ వద్ద ఉండే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, సార్ తో గడిపిన జ్ఞాపకాలను అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. తనని సినారె సార్ చాలా బాగా చూసుకునే వారని పేర్కొన్నారు.

సి.నారాయణ రెడ్డి 80కి పైగా సాహిత్య రచనలు,3వేల అరువందలపైగా పాటలకు సాహిత్యాన్ని సమకూర్చారు. తెలుగు భాష రచయితగా,కవిగా ఆయన ఎన్నో పురస్కారాలు అవార్డులను అందుకొని ఎందరికో స్ఫూర్తిగా,ఆదర్శంగా నిలిచారు. ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేసిన గొప్ప మహానీయుడు సినారే. తెలుగు భాష కోసమే అనునిత్యం అవిరాల కృషిచేసిన మహోన్నత శక్తి సినారే. సినారె కవితలు,రచనలు ఎంతో స్ఫూర్తిదాయకం, మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

2024-05-02T04:44:19Z dg43tfdfdgfd